50 మెంబర్స్ జనసేన టార్గెట్ పవన్ మిషన్ -2019

Fifty memebers Janasena target Pawan Kalyan mission

ఏపీలో ఎన్నికల కళ కనిపిస్తోంది…ఎవరిని కదిపినా ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే చర్చ ప్రతీ చోట జరుగుతోంది. అభివృద్ది తాను చేశాను నాకే ఓటు అని బాబు అంటే? అభివృద్ది లేదు లంచాలు అవినీతి ఈసారి నాకు ఓటు అని జగన్ అంటున్నారు. ఇక వీరు ఇద్దరు మోసకారులే నాకు ఓటు వేయండి అని అంటున్నారు పవన్.. మొత్తానికి ఈ త్రీడి పిక్చర్ లో ఎవరు గెలుస్తారు అనేది మరో 90 రోజుల్లో పొలిటికల్ స్క్రీన్ లో కనిపిస్తుంది. ఇక ఏపీలో త్రిముఖ పోటి ఉంటుంది అనేది ఎవరైనా చెబుతారు.

జనసేన -వైసీపీ -తెలుగుదేశం ఆర్డర్ ఎలా ఉన్నా ఓటుతో ప్రజా రివార్డు ఎలా ఉంటుంది అనేది చూడాలి..ఇక్కడ ఎన్నికల్లో ముఖ్యంగా ఈసారి జగన్ కు మైలేజ్ ఎంత ఉందో పవన్ కు అలాగే ఉంది.. అది సైలెంట్ ఓటింగ్ రూపంలో కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు.. ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకు పవన్ కు కచ్చితంగా పాజిటీవ్ అవుతుంది ..అది కూడా ఉత్తరాంధ్రా మూడు జిల్లాలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు మూడు మొత్తం ఐదు జిల్లాల్లో జగన్ బాబు కంటే ఎక్కువగా పవన్ కు కాపు ఓట్లు పడతాయి అంటున్నారు నాయకులు.

ఇక అనుభవం అని చంద్రబాబుకి అధికారం ఇస్తే, ఆయన రెండు జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకుని పవన్ ని పక్కన పెట్టారు.. ఇది జనసైనికులు జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలి అంటే పవన్ అవినీతికి దూరం, అసలు ఇలాంటి రాజకీయాలకు దూరం. అందుకే పవన్ ఈ సారి తన పార్టీ తరపున కచ్చితంగా గెలుపు వచ్చేలా 50 మంది నిజాయతీ పరులని తెలుగుదేశం వైసీపీకి టఫ్ కాంపిటీషన్ అయ్యేవారిని ఎంచుకున్నారట.

ఇప్పటికే వారిని ఫైనల్ చేశారట.. వైసీపీ – టీడీపీ నేతలకంటే బలమైన అభ్యర్దులు అని చెబుతున్నారు జనసేనలో.. . ఇక ఏపీలో కింగ్ మేకర్ గా పవన్ అవుతారు అని అంటున్నారు.. అందుకే పవన్ కూడా 50 బెంచ్ మార్క్ పెట్టుకున్నారు అనేది ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ.. అలాగే ఇరు పార్టీల్లో టిక్కెట్లు దక్కనివారు రెబల్స్ గాపోటీ చేసి మరో షాక్ ఇస్తారు అని, 15 మందిపైనే ఇలా గెలిచే అవకాశం ఉంది అని తెలుస్తోంది… సో పవన్ మాత్రం ఈ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ కంటే కీలక పాత్ర పోషిస్తారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.