Cinetollywood

ఎవ‌రు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Evaru movie review

సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ లకు కథ గా చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కేవలం స్క్రీన్ ప్లే జిమ్మిక్కులతో ఇంట్రస్టింగ్ గా నడుస్తూంటాయి. తర్వాత ఏం జరిగింది…అసలు హంతకుడు ఎవరు అనేది ఇలాంటి కథల యుఎస్ పి. అవి ఫెరఫెక్ట్ గా పండితే సినిమా ఫస్ట్ క్లాస్ లో పాసైపోయినట్లే. క్షణంతో అడవి శేషు తను అలాంటి సినిమాలు చేయగలనని ప్రూవ్ చేసారు. అయితే అలాంటి స్టోరీ లైన్, అందుకు తగ్గ కథనం రాయటం చాలా కష్టం. ఎందుకంటే వరల్డ్ సినిమాని చూస్తున్న నేటి ప్రేక్షకుడు తెరపై ఏ మాత్రం ఎక్కడ చిన్నపాటు తడబాటు ఉన్నా ఇట్టే పసిగట్టేసి బై చెప్పేస్తున్నాడు. దాంతో స్క్రీన్ ప్లే మీదే కసరత్తు చేయాల్సి వస్తోంది. అయితే అడవి శేషు ఈ సారి అంత కష్టం పెట్టుకోదలుచుకోలేదు. స్పానిష్ లో వచ్చి విజయవంతమైన The Invisible Guest (2016) అనే థ్రిల్లర్ కు రైట్స్ తీసుకుని కొద్ది పాటి మార్పులతో రీమేక్ చేసేసారు. ఈ సినిమా అంతకు ముందే హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను కాంబినేషన్లో ‘బద్లా’ గా రీమేక్ అయ్యి వచ్చి హిట్టైంది. మరి తెలుగులోనూ ఆ స్దాయి హిట్ అవుతుందా…సినిమాలో సస్పెన్స్ బాగా పండిందా.


కథ : ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతుంది సమీర (రెజీనా). తనపై రేప్ అటెమ్ట్ వల్లే ఆ హత్య చేయాల్సి వచ్చిందనేది సమీర వాదన. అయితే హత్య చేయబడ్డ అశోక్ (నవీన్ చంద్ర) డీఎస్పీ కావడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ ఆ కేసుని సీరియస్ గా తీసుకుని ఓ పేరున్న లాయర్ కి అప్పజెపుతుంది. బెయిల్ పై విడుదలైన సమీర తన లాయర్ బెనర్జీ సాయంతో తనకి వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు తెలుసుకునేందుకు లంచగొండి ఎస్సై విక్రమ్ సహదేవ్ (అడివి శేష్) సాయం తీసుకుంటుంది. అసలు నిజాలు తెలిస్తేనే తప్ప నెక్స్ట్ స్టెప్ వేయలేమంటాడు విక్రమ్. సమీర చెప్పిన మాటల్లోంచి వెలుగు చూసిన నిజాలెంటి.. హత్య జరగడానికి కారణాలేంటి.. హత్య ఎవరు.. ఎందుకు చేయాల్సి వచ్చింది…? ఈ కేసుకు వినయ్ వర్మ (మురళీ శర్మ) మిస్సింగ్ కేసుతో సంబంధమేమిటి అనేది మిగతా కథ.

సీన్స్ అన్ని పేక మేడల్లా ఒక దాని మీద మరొకటి జాగ్రత్తగా పేర్చుకుంటూ వచ్చారు. అందులో ఒకటి లాగినా మొత్తం నిర్దాక్ష్యణ్యంగా కూలిపోతుంది. ఆ విషయం గమనించే ఒరిజినల్‌ చిత్రమైన ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్’ సినిమాను చిన్న చిన్న ఛేంజెస్ తో ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించేశారు దర్శకుడు, అయితే ఆ మార్పులు కూడా ఇంటిలిజెంట్ గా ఇంట్రస్టింగ్ గానే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్, నేటివిటి పేరుతో అనవసర హంగామా చేయకుండా సింపుల్ గా నడపటమే కలిసొచ్చింది. సినిమా మొత్తం రెజనా, అడవి శేషుల చుట్టూనే తిరుగుతుంది.

వాళ్లిద్దరి మధ్య జరిగే డైలాగులు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. సైడ్ క్యారక్టర్స్ లో కనిపించిన పాత్రలు కూడా సినిమాకు కీలకం. ఒక్క పాత్ర కానీ, సీన్ కానీ వృధాగా అనిపించదు. ఈ కేసును అడవి శేషు ఎలా ఛేదించారన్న విషయాలు మాత్రం సెకండాఫ్ లో చూపించారు. దాంతో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీతగా,బోర్ గా అనిపించినా అవి పరిగణనలోకి రావు. క్లైమాక్స్ ట్విస్ట్ అన్నిటినీ మరిపిస్తుంది. ఓ చక్కటి సినిమా చూసామని ఫీల్ కలిగిస్తూ ముగుస్తుంది.ఎలా చేసారంటే..? క్యారక్టర్ ని ఇన్‌టెన్సిటీతో క్యారీ చేయ‌డంలో అడివిశేష్ ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యాడు‌. న‌వీన్ చంద్ర‌, రెజీనా క‌సండ్ర పాత్రలు సినిమాకు మెయిన్ పిల్లర్స్. ముర‌ళీశ‌ర్మ‌, ప‌విత్రా లోకేష్‌లు లాంటి వాళ్లు తమ పరిధి మేరకు మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు.

టెక్నికల్ గా.. ఇలాంటి సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ బాగా అవసరం. ఆ విషయంలో వందకు వంద శాతం టీమ్ కలిసొచ్చింది. తెరపై కనపడే సీన్స్ వెనక మనకు తెలియని ఏదో మిస్టరీ ఉందనించేలా బ్యాగ్రౌండ్ స్కోర్‌ని డిజైన్ చేసారు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌.ఇక వంశీ ప‌చ్చిపులుసు ప్రతి సీన్ ని ఎంతో రిచ్‌గా తెర‌కెక్కించాడు. ఎడిటింగ్ సైతం చాలా క్ర్రిప్స్ గా ఉంది. అబ్బూరి ర‌వి డైలాగులు సైతం ఈ థ్రిల్లర్ కు కలిసొచ్చాయి. పివీపి బ్యానర్ కు తగ్గట్టు నిర్మాణ విలువలు రిచ్‌గానే ఉన్నాయి. సినిమా లెంగ్త్ తక్కువగా ఉండటం కూడా ఈ సినిమా సక్సెస్ కు కలిసొచ్చే అంశం.

Rating: 3.5/5

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.