తూగోలో జనసేన అభ్యర్దులు లిస్ట్ రెడీ

East godavari will be the Janasena candidates list out

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన మంచి జోష్ మీద ఉంది. ఇప్పటికే పార్టీ తరపున ఆశావాహులు తమకు టికెట్ కేటాయించాలి అని కమిటికి తెలియచేశారు. ఓవైపు తెలుగుదేశం వైసీపీకి ధీటుగా పోటికి అభ్యర్దులను దింపేందుకు జనసేనాని సిద్దం అవుతున్నారు.

జనసేన ఈ నెల 14వ తేదీలోగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తు ఉండటం వల్ల తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం సీటును సీపీఎంకు, గన్నవరం సీపీఐకు కేటాయించడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన 17 అసెంబ్లీ స్థానాల్లోనూ జనసేన పోటీ చేయనుంది.

ఇక జిల్లాలో ముఖ్యంగా మెజార్టీ కాపు వర్గీయులకు టిక్కెట్లు రానున్నాయి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటిది లేదు అంటున్నారు జనసేన సైనికులు. జనసేన అన్ని ముఖ్య వర్గాలకు సీట్లు ఇచ్చే ఆలోచ నలో ఉందట. బీసీలకు ఐదు నుంచి ఆరు సీట్లు, కాపులకు 6 నుంచి 7 ఇవ్వనుంది. మూడు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానం ఉన్న సంగతి తెలిసిందే ఎస్సీల్లో రెండు స్థానాల్లో కూడా మాల వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్యులకు కూడా కనీసం ఒక్కోటి కేటాయించే ఆలోచనలో ఉంది.ఆకుల సత్యనారాయణ రాజమహేంద్రరవరం లోక్సభ సీటుకు ఆయన పేరు ఫైనల్ చేశారు అని తెలుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

ఓసారి ఎవరు ఎవరు జిల్లా నుంచి పోటీకి ఉన్నారు అనేది చూద్దాం

కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన రాష్ట్ర కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య..అద్దేపల్లి శ్రీధర్ కూడా ఎంపీ స్థానానికి దరఖాస్తు చేశారు
మాకినీడి శేషుకుమారి, చిక్కాల సుబ్బారావు కూడా ఆశావాహులుగా ఉన్నారు.
రంపచోడవరం నుంచి సీపీఎం తరపున భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య
పి.గన్నవరం నుంచి సీపీఐ జిల్లా క్యాదర్శి తాటిపాక మధు
ముమ్మిడివరం అభ్యర్థిగా పితాని బాలకృష్ణకు తొలి టిక్కెట్టు పవన్ ప్రకటించారు
కాకినాడ నుంచి వైశ్య వర్గానికి టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం
తుని నుంచి మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు, చోడిశెట్టి గణేష్ టిక్కెట్ ఆశిస్తున్నారు.
కాకినాడ నుంచి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన కుమారుడు ముత్తా శశిధర్, కడలి ఈశ్వరి, జ్యోతుల వెంకటేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు
కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, మాకినీడి శేషుకుమారి, రాజారపు మహేష్, చిక్కాల సుబ్బారావు ఆశావాహులుగా ఉన్నారు
పిఠాపురం నుంచి అనిశెట్టి సుబ్బారావు, సూరపురెడ్డి సురేష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, చిక్కాల లక్ష్మి
పెద్దాపురం నుంచి పంతం గాంధీమోహన్, అత్తిలి సీతారామస్వామి
జగ్గంపేట నుంచి పాటంశెట్టి సూర్యచంద్రరావు, గుదిరెడ్డి శ్రీనివాస్
ప్రత్తిపాడు నుంచి గింజాల శ్రీనివాస్, వరుపుల తమ్మయ్య
రాజానగరం నుంచి గిరజాల వెంకటస్వామినాయుడు, రాయపురెడ్డి చిన్న, వడ్డ్డి శ్రీనివాసనాయుడు
రాజమహేంద్రవరం సిటీ నుంచి కొడాలి తనూజ, కొల్లివెలసి హారిక, అద్దేపల్లి శ్రీధర్, అనుశ్రీ (అత్తి) సత్యనారాయణ
రాజమహేంద్రవరం రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మేడా గురుదత్ప్రసాద్ టిక్కెట్టు ఆశిస్తున్నారు.
రామచంద్రపురం నుంచి చింతపల్లి బన్ని, నారపురెడ్డి పార్థసారధి
మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, మర్రెడ్డి శ్రీనివాస్, వేగుళ్ల లీలాకృష్ణ
అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, కొత్తా రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు,
పి.గన్నవరం నుంచి పాముల రాజేశ్వరీదేవి, ఇన్నాపు లలిత, ఆకురాతి చిన్న,
రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, మహాలక్ష్మీప్రసాద్
అనపర్తి నుంచి రేలంగి నాగేశ్వరరావు
కొత్తపేట నుంచి బండారు శ్రీనివాసరావు, సంగీత సాయిగుణరంజన్, బండి రాధమ్మ, ఎర్రా రాఘవులు ఆశావహులుగా వున్నారు.

సో పవన్ కల్యాణ్ వీరిలో ఎవరి సెలక్ట్ చేస్తారు అనేది జిల్లాలో పెద్ద చర్చ నడుస్తున్న అంశం

విశ్లేషణ!! వీజీ

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.