డీజే సినిమా రివ్యూ

Duvvada Jagannadham Review at Cinetollywood.com

 

సరైనోడు సినిమా తరవాత గ్యాప్ తీసుకున్న అల్లూ అర్జున్ హరీష్ శంకర్ చేతిలో తన భవిష్యత్తు పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు. గతం లో గబ్బర్ సింగ్ తరవాత హిట్ లు లేని హరీష్ కి బన్నీ కాల్ షీట్ లు ఇవ్వడం ఎందుకా అనుకున్నారు. కానీ సినిమా ట్రైలర్ లూ, పాటలూ , టీజర్ లూ చూసిన తరవాత మాత్రం హరీష్ గట్టిగానే సినిమా సాగిస్తాడు అనిపించింది .



కథలోకి వెళ్తే, దువ్వాడ జగన్నాథం చిన్నతనం లోనే లోకల్ పోలీస్ ఆఫీసర్ (మురళి శర్మ) తో కలిసి డీజే గా మారతాడు. మనిషి కనపడకుండా నే మంచి చెయ్యచ్చు అనే తన తాత చెప్పిన సిద్ధాంతం తో పోలీసు సహాయం తో అన్యాయం చేసే వాళ్ళ ఆట కట్టిస్తూ ఉంటాడు. డీజే అనే పేరు వినడమే తప్ప అతనొక గ్యాంగ్ స్టర్ అని తెలుసు కానీ మొఖం చూసినవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలా పెరిగి పెద్ద అయిన డీజే ఒక పక్క అగ్రహారం లో బ్రాహ్మణుడు గా వంటలు చేస్తూ మరొక పక్క ఎవరికీ తెలీకుండా ప్రాణాలు తీస్తూ ఉంటాడు. అగ్రహారంలో తనికెళ్ల భరణి క్యాటరింగ్ టీంలో దువ్వాడ జగన్నాధం డిజె వంట మాస్టర్ గా పనిచేస్తుంటాడు. ఓ ఫంక్షన్ లో పూజా హెగ్దెని చూసిన డిజె ప్రేమలో పడతాడు. ఈ నేపధ్యం లో అగ్రీ డైమండ్ అనే సంస్థ పెట్టి జనాలని మోసం చేస్తున్న రొయ్యల నాయుడు తన బినామీ తో ఈ బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం డీజే సినిమా మొత్తం ప్రయత్నం చేస్తాడు . చివరికి రొయ్యల నాయుడు ఎవరు అతను దొరికాడా లేదా అనేది తెర మీద చూడాలి .. ఈ సినిమాకి పాటలు అతిపెద్ద ఆస్తిగా చెప్పుకోవాలి , ఆడియో తో పాటు స్క్రీన్ మీద కూడా సాంగ్స్ కుమ్మేసాయి. ఫైట్ ల విషయం లో ఎలివేషన్ లు బాగా ప్లాన్ చేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్. హరీష్ డైలాగ్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ లు .. అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ ఫైట్ , లాస్ట్ లో వచ్చే కామెడీ సినిమాని నిలబెట్టాయి అని చెప్పచ్చు .

అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. డిజె శాస్త్రిగా అల్లు అర్జున్ మంచి నటన కనబరిచాడు. అయితే ఈ పాత్ర అదుర్స్ లో ఎన్.టి.ఆర్ పోశించిన చారి పాత్రలో పోలిక పెట్టడం సమంజసం కాదు. బన్ని ఎన్.టి.ఆర్ ఎవరికి వారు అన్నంతలా నటించాడు. ఇక పూజా హెగ్దె ఈ సినిమాలో అందాలను గుమ్మరించింది.కచ్చితంగా పూజా గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుంది.విలన్ గా రావు రమేష్ మరోసారి అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్, సుబ్బరాజుల కామెడీ బాగుంది. పోలీస్ పాత్రలో మురళి శర్మ అదరగొట్టగా.. తణికెళ్ల భరణి కూడా ఆకట్టుకున్నారు. మొత్తం మీద చూస్తే దువ్వాడ జగన్నాథం సినిమా పక్కా రొటీన్ బొమ్మ అయినా పాజిటివ్ అసెట్ లతో ముందుకు వెళ్ళాడు బన్నీ. స్టైలింగ్ లో తన మార్క్ చూపిస్తూ సినిమాని గ్రిప్ లోకి తెచ్చుకునే కామెడీ, ఫైట్ లూ , సాంగ్స్ లాంటి అంశాలలో వంద మార్కులు వేయించుకుని అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు అనిపిస్తుంది. డైరెక్టర్ కంటే రైటర్ గా హరీష్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. డైలాగ్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ , ఫస్ట్ హాఫ్ లో కొంత, ఆఖర్లో వింత కామెడీ ఇవన్నీ కలగలిపి చూస్తే చాలా చోట్ల బోర్ కొట్టినా వీటి వలన డీజే గట్టెక్కింది అనే చెప్పచ్చు.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.