
డిస్కోరాజా మూవీ రివ్యూ
బ్యానర్: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: రవితేజ, నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్, బాబీ సింహ, సునీల్, వెన్నెలకిషోర్, సత్య, అజయ్, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
!!ఇంట్రో !!
మాస్ మహారాజ్ తన దైన నటనతో ఆకట్టుకునే రవితేజ తాజాగా సినిమాల జోరు తగ్గించారు గతంలో హిట్ ట్రాక్ లతో మాస్ మహారాజ్ సందడి చేసేవారు సంవత్సరానికి రెండు సినిమాలతో షేక్ చేసేవాడు.. అయితే గ్యాప్ తీసుకుంటూ సినిమాలని సెలక్ట్ చేసుకుంటున్నారు రవితేజ.
రాజాదిగ్రేట్ సక్సెస్ తర్వాత రవితేజ చేసిన మూడు సినిమాలు టచ్ చేసిచూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని.. బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ చిత్రాలుగానే మిగిలాయి. ఇక కాస్త భిన్నంగా సినిమా చేయాలనే ఆలోచనతో దర్శకుడు వి.ఐ.ఆనంద్‌తో చేతులు కలిపాడు రవితేజ.
వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డిస్కోరాజా.. మరి తాజాగా విడుదలైన ఈ ఫిక్షన్ ద్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం.
!!కథ!!
వాసు(రవితేజ) అనాథ. తనతో పాటు మరికొంత మంది అనాథలను చేరదీసి పెంచుతుంటాడు. వారు ఉంటున్న ఇల్లును కొనుక్కోవాలని అనుకుంటారు. దాని కోసం పాతిక లక్షల రూపాయలను పోగు చేస్తారు. అయితే ఆ డబ్బులు వేరొకరు దొంగలిస్తారు. ఆ డబ్బును వెతుక్కుంటూ వాసు గోవా వెళతాడు. అయితే వాసు లడక్‌లో చనిపోయి మంచు గడ్డల్లో కూరుకుపోతాడు. అతని శవాన్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్త ఆ శవంలోని అవయవాలు పాడు కాకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభుత్వానికి తెలియకుండా తాను చేస్తున్న ఓ ప్రయోగం ద్వారా ఆ శవానికి ప్రాణం పోస్తాడు. అయితే ప్రాణం వచ్చిన తర్వాత సదరు వ్యక్తికి ఏవీ గుర్తుండవు. అతని గురించి తెలిసిన కొందరు వ్యక్తులు చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు వారికి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. డాక్టర్ల ప్రయోగం ద్వారా ప్రాణం పోసుకుంది వాసు కాదని.. 35 ఏళ్ల క్రితం చంపబడ్డ డిస్కోరాజా అని. అసలు డిస్కోరాజా ఎవరు? అతని 35 ఏళ్ల క్రితం ఎవరు చంపేస్తారు? మరి వాసు ఏమవుతాడు? వాసు ఎవరు? డిస్కోరాజాకి, సేతుకి ఉన్న వైరమేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డిస్కోరాజా..డిస్కో మ్యూజిక్‌ను ఇష్టపడే రాజా అనే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. సింపుల్‌గా చెప్పాలంటే ఇదే సినిమా లైన్. రెగ్యులర్ కమర్షియల్ మూవీ. నాన్న రవితేజ చనిపోవడం.. అతనికి కొడుకు రవితేజ ఉండటం. అతనిపై పగ సాధించడానికి వచ్చిన విలన్స్ భరతం ఎలా పట్టారనేది మూల కథ. కొడుకు పాత్రను అనాథ చూపించి అతని చుట్టూ కథను నడపడం బాగుంది.
కొడుకు పాత్రకు ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. అతనికే స్కోప్ లేదంటే అతని గర్ల్‌ఫ్రెండ్ పాత్రకు ఇంకేం స్కోప్ ఉంటుంది. అలాంటి పాత్రలో నభా నటేశ్ నటించింది. ఆమెకు ఈ సినిమాలో నటించే సీనే కనపడలేదు. ఇస్మార్ట్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఈ చిత్రంలో నటించింది. సినిమాని డిస్కోరాజా పాత్రలో బాగా చేశారు రవితేజ, ఎక్కడా రెండు పాత్రల్లో ఏజ్ గ్యాప్ లేకుండా రవితేజ చేయడం అభినందనీయం. ఆ విషయంలో డైరెక్టర్ వి.ఐ.ఆనంద్‌ను అభినందించాలి.. పాయల్ రాజ్‌పుత్ పాత్ర జస్ట్ ఓకే. ఓపాట మరికొన్ని సీన్స్‌తో తన పాత్రను పరిమితం చేశారు.
కానీ తనకు ఈ పాత్ర పెద్ద బ్రేక్ ఇవ్వదని సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఇక తాన్యా హోప్ పాత్ర గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత బెటర్. ఇక రాంకీ, సత్య, సునీల్, రఘుబాబు, భరత్, వెన్నెలకిషోర్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అలాగే రవితేజ నటన అమోఘం అనే చెప్పాలి.
తమన్ సంగీతం నువ్వు నాతో ఏమన్నావో …పాట మాత్రమే వినడానికి బావుంది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం సినిమా ప్రారంభంలో వచ్చే లడక్ సన్నివేశాల్లో సూపర్బ్. మిగతా వాటిలో ఓకే అనిపిస్తుంది. డిస్కోరాజా.. మరోసారి అభిమానులకి డిస్క్ చేయించాడు
రేటింగ్: 2.5/5