‘రంగస్థలం’పై ఇంట్రెస్టింగ్ న్యూస్!

Director Sukumar reveals interesting topics about Rangasthalam Movie

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం 1985’ పై మెగాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ అందరిలోనూ మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులో ఇటువంటి టైటిల్ తో, ఇటువంటి కాన్సెప్ట్ తో సినిమా వచ్చి చాలా రోజులే అయింది. ఈ సినిమా టైటిల్ ను బట్టి ఇందులో రామ్ చరణ్ రంగ స్థల నటుడిగా నటిస్తున్నారని, నాటకాల నేపథ్యంలో సినిమా ఉంటుందని ఇలా రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

అయితే రీసెంట్ గా ‘రంగస్థలం’ మూవీకి సంబంధించి డైరెక్టర్ సుకుమార్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసాడు. ఒక ఊరిలో మనుష్యుల మధ్యే రకరకాల వైరుధ్యాలు ఉంటాయని అవి నాటకాల్లోని పాత్రల్లా ఉంటాయని చెప్పుకొచ్చారు. గ్రామంలో కొందరు ద్వేషం, స్వార్ధం, అసూయ వంటి చెడు లక్షణాలతో ఉంటారని, కొందరు మాత్రం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారని ఆ ఉద్దేశంతోనే ‘రంగస్థలం’ అనే టైటిల్ పెట్టినట్టు చెప్పుకొచ్చాడు.

దాంతో పాటు తాను చాలా మారుమూల గ్రామంలో జన్మించానని , గ్రామీణ నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నానని సుకుమార్ చెప్పుకొచ్చాడు. సుకుమార్ చెపుతున్న విషయాలు, సినిమా టైటిల్ , రామ్ చరణ్ గెటప్ చూస్తుంటే ఈ సినిమా హిట్ కావడం తథ్యమంటూ మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.