
పక్కా ప్లాన్‌తో క్రిష్ స్టెప్స్! అద్భుతమైన రోజంటూ డైరెక్టర్ ఓపెన్..పవన్ కళ్యాణ్‌తో సిట్టింగ్
డైరెక్టర్ క్రిష్‌తో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న క్రిష్.. పవన్ కళ్యాణ్‌తో
రీ- ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. ఇటీవల ‘వకీల్ సాబ్’ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఆయన.. అదే జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్‌తో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా పదునైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కళ్ళకు కట్టినట్లు చూపాలని ప్లాన్ చేసిన క్రిష్.. ఎప్పటికప్పుడు స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తూ మెరుగైన అవుట్‌పుట్ వచ్చేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌కి స్క్రిప్ట్ చూపిస్తూ ఆయనతో చర్చిస్తున్న ఓ పిక్ షేర్ చేశారు డైరెక్టర్ క్రిష్. ఈ మేరకు ”పవన్‌తో హరిహర వీరమల్లు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్. ఇది అద్భుతమైన రోజు. కొత్త సంవత్సరంలో ఉత్తేజకరమైన షెడ్యూల్ ప్రారంభించబోతున్నాం” అని పేర్కొన్నారు క్రిష్. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
గతంలో నందమూరి బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి అనే హిస్టారికల్ మూవీ చేసి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న క్రిష్.. ఈ సారి పవన్ కళ్యాణ్‌తో అలాంటి ప్రయోగమే చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇదే ఆయనకు తొలి పీరియాడికల్ మూవీ కానుండటం విశేషం.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్