Cinetollywood

పూరీ,ఎన్టీఆర్..మధ్యలో బాలయ్య

రీసెంట్ గా వచ్చిన ఓ న్యూస్ టాలీవుడ్ ను కుదిపేసింది. ఇటీవల విడుదలైన ‘జై లవకుశ’ టీజర్ ను చూసిన అగ్రదర్శకుడు పూరీ జగన్నాథ్ షాక్ తిన్నాడట. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం తాను తారక్ కు చెప్పిన కథ, సన్నివేశాలు టీజర్ లో ఉన్నాయని చెపుతూ పూరీ ఆగ్రహం వ్యక్తం చేసాడని ఒక ప్రముఖ దినపత్రికలో న్యూస్ వచ్చింది. దీంతో ‘జైలవకుశ’ దర్శకుడు బాబీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తమది కంప్లీట్ వేరే కథ అని అలా జరిగే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చాడు. అయితే పూరీ చెప్పిన కథను ఎన్టీఆర్ కాపీ కొట్టారా అన్న అనుమానాలు రెకేత్తాయి. 
 
అయితే చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ గురించి తెలిసిన వాళ్లు మాత్రం అలా జరిగే ఛాన్స్ లేదంటున్నారు. ఒక డైరెక్టర్ చెప్పిన కథను వేరే డైరెక్టర్ కు చెప్పి చేయించుకునే అలవాటు తారక్ లేదని వారు చెపుతున్నారు. కానీ పూరీకి ఎన్టీఆర్ కు ఎక్కడ చెడిందన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూరీ చెప్పిన కథకు తారక్ ఎందుకు ఓకే చెప్పలేదు. ఇప్పుడు పూరీ ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసాడన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్. 
 
ఇదిలా ఉంటే మరోవైపు ఈ వివాదంలోకి హీరో బాలకృష్ణను కూడా లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పూరీ , బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న ‘పైసా వసూల్’ , ఎన్టీఆర్ ‘జై లవకుశ’ దసరా బరిలో దిగనున్నాయి. ఇందులో ‘జై లవకుశ’ ఒక వారం ముందు రావచ్చని తెలుస్తోంది. అయితే పూరీ చెపుతున్న సీన్స్ ‘పైసా వసూల్’ లో ఉంటే ముందుగా వస్తున్న ‘జై లవకుశ’ లబ్ది పొందుతుందని, ‘పైసా వసూల్’ కు నిరాశ తప్పకపోవచ్చని టాక్. గత కొంత కాలంగా బాబాయ్ కు అబ్బాయి కి సత్సంబంధాలు లేకపోవడంతో ఈ విష‍యం ఎటువంటి వివాదాలకు దారితీస్తోందనని నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.