Cinetollywood

దర్బార్ రివ్యూ

Darbar movie review and rating

చిత్రం: దర్బార్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
విడుదల: ఎన్.వి.ప్రసాద్
నటీనటులు: రజినీకాంత్, నయనతార, సునీల్శెట్టి, నివేదా థామస్, ప్రతీక్ బబ్బర్, యోగిబాబు, దలీప్ తాహిల్, తంబిరామయ్య, శ్రీమాన్ తదితరులు
సంగీతం: అనిరుధ్
కెమెరా: సంతోశ్ శివన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్

!! ఇంట్రో!!
సూపర్స్టార్ రజినీకాంత్ ఆయన అంటే తెలియని వారు ఉండరు.. పరిచయం అక్కర్లేని పేరు. సౌతిండియన్ సూపర్స్టార్గా ఆయనకున్న క్రేజే వేరు. నిజంగా నటుడిగా ఆయన ప్రయాణం కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇక ఈ మధ్య హిట్లు పెద్ద పలకరించడం లేదు.. కాని ఆయన సినిమాలు మాత్రం ఎక్కడా లాస్ అనేది రావు, రోబో తర్వాత ఆయనకు పెద్ద హిట్ రాలేదు అని అంటారు అభిమానులు.. తాజాగా స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ చేసిన సినిమా దర్బార్, మరి నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీకాంత్ పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతో మంచి అంచాలను క్రియేట్ చేసింది. వాస్తవంగా వెండితెరపై ఎలా ఉందో చూద్దాం.

!! కథ !!
ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం రజినీకాంత్, గ్యాంగ్స్టర్స్ను ఎన్కౌంటర్ చేసేస్తుంటాడు. ఒక రోజులోనే 13 మందిని ఎన్కౌంటర్ చేసేస్తాడు. దాంతో ముంబైలోని దాదాలందరూ భయపడిపోతుంటారు. మానవ హక్కుల కమీషన్ను కూడా ఆదిత్య అరుణాచలం లెక్క చేయడు. అక్కడ నుండి కథ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ నుండి ముంబైకి స్పెషల్ ఆర్డర్ మీద ఆదిత్య ముంబై వస్తాడు. హరి చోప్రా సునీల్ శెట్టి కారణంగా ముంబై పోలీసులను ఎవరూ లెక్కచేయరు. ప్రజల్లో పోలీసులంటే భయం ఉండదు. ఆ సమయంలో ముంబైలో అడుగు పెట్టిన ఆదిత్యకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కుమార్తె కిడ్నాప్ గురించి తెలుస్తుంది.

ఆమెను కనిపెడుతూనే ముంబైలోని డ్రగ్స్, హ్యుమన్ ట్రాఫికింగ్ సమస్యను నిర్మూలిస్తాడు. దాంతో ప్రజలకు మళ్లీ పోలీసులంటే నమ్మకం పెరుగుతుంది. అదే సమయంలో వినోద్ మల్హోత్రా(నవాబ్ షా) కొడుకు అజయ్ మల్హోత్రా(ప్రతీక్ బబ్బర్) కారణంగానే ముంబైలోడగ్స్ రాకెట్ డెవలప్ అయ్యిందని తెలుస్తుంది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తాడు. దాంతో అతన్ని తప్పించడానికి వినోద్ మల్హోత్రా ఓ ప్లాన్ వేస్తాడు. అయితే ఆ ప్లాన్ని ఆదిత్య కనిపెట్టేస్తాడు. ఇంతకు వినోద్ మల్హోత్రా వేసే ప్లాన్ ఏంటి? దానికి ఆదిత్య ఏం చేస్తాడు? అజయ్కి హరి చోప్రాకు ఉన్న లింకేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

!! విశ్లేషణ !!

రోబో తర్వాత రజనీ నాలుగు సినిమాలు చేశారు, కాని అంతగా ఆకట్టుకోలేకపోయాయి, మళ్లీ మాస్ కమర్షియల్ సినిమా కోసం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో కలిసి సినిమా చేశారు. మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఇది.. ఆయన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని మురుగదాస్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో దర్బార్ సినిమాను తెరకెక్కించారు.. రజినీకాంత్ సోలో పెర్ఫామెన్స్తో సినిమాలో అంతా తానై కనిపించాడు.

హీరోయిన్గా చేసిన నయనతార, కూతురుగా చేసిన నివేదా థామస్ వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సెకండాఫ్ అంతా మెయిన్ విలన్ సునీల్ శెట్టి, హీరో రజినీకాంత్ మధ్యనే ఎక్కువ భాగం సాగుతుంది. ప్రతీక్ బబ్బర్, నవాజ్షా, యోగిబాబు ఉన్నంతలో కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. రజినీ లవ్ట్రాక్కు ఓ రీజన్ పెట్టి దానిని నడిపే ట్రాక్ బాగా తీశారు. చాలా వరకూ సీన్స్ అద్బుతంగా వచ్చాయి.. రజనీ స్టైల్ ఇందులో మరో రేంజ్ కు వెళ్లింది, సినిమాలో రజినీకాంత్ ఇంట్రడక్షన్ ఫైట్ సింప్లీ సూపర్బ్.. రామ్లక్ష్మణ్ ఫైట్ అద్బుతం అనే చెప్పాలి.

సినిమాలో పోలీస్ మానరిజం లో కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రజినీ కాంత్ విలన్ని ఇబ్బంది పెడుతూనే సెటైరికల్గా మాట్లాడే సన్నివేశాలు బావుంటాయి. ఇక సినిమాను అనిరుధ్ తన సంగీతంతో నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లాడు. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.

!! ప్లస్ పాయింట్స్ !!
రజనీ యాక్షన్ నేపథ్య సంగీతం
డైలాగ్స్
డైరెక్షన్
సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బావుంది.

!! మైనస్ పాయింట్స్ !!
సెకండాఫ్ పై ఇంకా ఫోకస్ చేయాల్సింది
పాటలు

ట్యాగ్ లైన్ —కాప్స్ తో పెట్టుకుంటే విలన్ పని అంతే

=రేటింగ్: 3/5

’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.