Cinetollywood

దబంగ్ 3 రివ్యూ

నటీనటులు: సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుదీప్, సయీ మంజ్రేకర్.
దర్శకత్వం : ప్రభుదేవా
నిర్మాతలు: సల్మాన్ఖాన్, అర్బజ్ ఖాన్, నిఖిల్ దివేది
సంగీతం: సుదీప్ శిరోద్కర్

—ఇంట్రో—

ఖాన్స్ సినిమాలు వస్తున్నాయి అంటే ఆ జోష్ ఉంటుంది బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే ..దబంగ్ 1 అలాగే 2 కూడా రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేశాయి, ఇందులో పోలీస్ పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఆయన దబంగ్ ప్రాంఛైజీని కొనసాగిస్తూ దబంగ్ 3 చిత్రంలో మరోసారి పోలీస్ గెటప్లో కనిపించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఈ సినిమా రిలీజ్ అయింది మరి ఎలా ఉందో ఓ లుక్కెద్దాం.

—కథ—
చుల్బుల్ పాండే (సల్మాన్ఖాన్) ఓ పవర్ఫుల్ పోలీస్. తన భార్య రాజో (సోనాక్షి సిన్హా), సోదరుడు మక్కీ (అర్బజ్ఖాన్)తో ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సల్మాన్ తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసి ఎందరో అమ్మాయిలను రక్షిస్తాడు. ఈ విషయం ధనవంతుడైన బల్లి (సుదీప్)కు కోపం తెప్పిస్తుంది. దీంతో సల్మాన్ ఖాన్ గతం ప్రారంభమవుతుంది. అసలు ఓ సాధారణ యువకుడి నుంచి చుల్బుల్ పాండేగా సల్మాన్ ఎందుకు మారాడు. తనకి ఖుషీకి (సయీ) మధ్య ఉన్న ప్రేమ. ఎంతగానో ప్రేమించిన ఖుషీ, చుల్బుల్ పాండేకు ఎందుకు దూరమైంది..? అనే విషయాలు తెలియాలంటే ‘దబంగ్ 3’ని చూడాల్సిందే..

—విశ్లేషణ—
సల్మాన్ సినిమా పై దబంగ్ 3 గురించి సినిమా అనౌన్స్ మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సల్మాన్పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్, ఆయన ఎంట్రీ సీన్తో పాటు పలు సన్నివేశాలు సల్మాన్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. చుల్బుల్ పాండేగా ఆయన చెప్పిన డైలాగులు మాస్కు నచ్చేలా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా అదరగొట్టాడు సల్మాన్.కధనం మధ్యలో నెమ్మదించినా సెకండాఫ్ అదిరిపోయింది
ఇక కామెడీనీ బాగా చొప్పించారు చిత్రంలో.

రెండు సినిమాల్లో కెల్లా దబంగ్ 3లో సల్మాన్ యాక్షన్ ఆకట్టుకునేలా ఉంది. తనదైన శైలిలో సంభాషణలు చెప్పి అలరించారు ఆయనపై చిత్రీకరించిన షర్ట్ లెస్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రతినాయకుడు బల్లి పాత్రలో సుదీప్ నటన చాలా బాగుంది. సోనాక్షిసిన్హా పాత్ర పరిధి మేరకు ఉన్నా ఆమె నటనకు బాగానే మార్కులు పడతాయి..సల్మాన్ ప్రియురాలు ఖుషీ పాత్రలో సయీ మెప్పించారు. మున్నీ బాద్నామ్ హూయీ పాటతో పాటు టైటిల్ సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా అలరించింది. మొత్తానికి ఏడాది ఎండింగ్ లో అదిరిపోయే ట్రీట్ అభిమానులకు ఇచ్చాడు సల్మాన్ ఖాన్ .

—బలాలు—

సల్మాన్
యాక్షన్ సన్నివేశాలు
సుదీప్
పాటలు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
బలమైన కథనం

—బలహీనతలు—

అతికి అతకని కామెడీ సన్నివేశాలు
నెమ్మదించిన కథనం

—బాటమ్ లైన్ —ఈ ఏడాది మాస్ మసాలా ఎంటర్టైనర్

రేటింగ్ 3

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.