
అవెక్కడ అని ప్రశ్న వైరల్ అవుతున్న ట్వీట్…పుష్పరాజ్‌కి సైబరాబాద్ పోలీసులు ప్రశ్న
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రైజ్’. ఇందులో ఆయన పాత్ర పేరు పుష్పరాజ్. ఈయన్ని ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ప్రశ్నించారు. అదేంటి? బన్నీ ఎప్పుడు సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు? ఈ మధ్య పుష్ప రిలీజ్ సమయంలో కేసులు నమోదు అయ్యాయి కదా.. వాటి కారణంగానే పోలీసులు బన్నీని ప్రశ్నించారా? అనే సందేహం కూడా రాక మానదు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రైజ్’. ఇందులో ఆయన పాత్ర పేరు పుష్పరాజ్. ఈయన్ని ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ప్రశ్నించారు. అదేంటి? బన్నీ ఎప్పుడు సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు? ఈ మధ్య పుష్ప రిలీజ్ సమయంలో కేసులు నమోదు అయ్యాయి కదా.. వాటి కారణంగానే పోలీసులు బన్నీని ప్రశ్నించారా? అనే సందేహం కూడా రాక మానదు. అయితే పుష్పరాజ్‌ను సైబరాబాద్ పోలీసులు ప్రశ్నించింది. ట్విట్టర్ ద్వారా. ఇంతకీ ఏమని ప్రశ్నించారు అనే విషయం తెలుసుకోవాలని ఉందా? అసలు విషయం ఏంటంటే.. సైబరాబాద్ పోలీసులు సినిమాల ద్వారా ప్రజలకు సందేశాలు ఇస్తూ వస్తున్నారు.
ఇప్పుడు ‘పుష్ప ది రైజ్ సినిమా ద్వారా కూడా మరో మెసేజ్ ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. అది కూడా ప్రశ్న రూపంలో.. పుష్ప మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ పాత్ర ట్రైలర్‌లో పార్టీ లేదా? పుష్ప అని అంటాడు.. దానిపై చాలా మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు దాన్ని పాజిటివ్ యాంగిల్‌లో ఉపయోగించుకున్నారు. అదెలాగంటే.. పుష్ప సినిమాలో బన్నీ బైక్ తోలే పోస్టర్ ఉంది. అందులో ఆయన హెల్మెట్ వేసుకోడు.. బైక్‌కి సైడ్ మిర్రర్స్ ఉండవు. ‘హెల్మెట్, సైడ్ మిర్రర్స్ లేవా పుష్ప.. ’ అంటూ ఫహాద్ ఫాజిల్ ప్రశ్నించేలా మీమ్ పోస్టర్‌ను తయారు చేసిన సైబరాబాద్ పోలీసులు దాన్ని తమ అధికారిక వెబ్ సైట్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు హెల్మెట్ ధరించండి, రే వ్యూ మిర్రర్ ఫిక్స్ చేసుకుని సురక్షితంగా ఉండండంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు సదరు ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ట్రెండింగ్‌లో ఉన్న సినిమాను.. అందులో అంశాన్ని ఉపయోగించుకుని ప్రజలకు మెసేజ్ ఇచ్చేలా చేసిన సైబరాబాద్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. పుష్ప ది రైజ్ సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ బ్యాడ్ కాప్‌గా నటించారు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్