రజనీ కమల్ కు చిరంజీవి బెస్ట్ సలహ

Chiranjeevi suggests Rajinikanth and Kamal Haasan on entering politics

సినిమాల్లో చిరంజీవి ఎప్పటికీ మెగాస్టార్ అనే చెప్పాలి.. అయితే చిరంజీవి రాజకీయాల్లో మాత్రం సక్సస్ కాలేకపోయారు. అంతేకాదు ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ కూడా సక్సెస్ కాలేకపోయారు, అయితే మెగా కుటుంబం మాత్రం రాజకీయాలు వదలదు అనే చెప్పాలి. పవన్ కల్యాణ్ రాజకీయంగా పోరాటం చేస్తూనే ఉంటారు, కాని ఇటీవల చిరంజీవి మాత్రం రాజకీయాలను పక్కన పెట్టేశారు.

అయితే తాజాగా చిరంజీవి సినీరంగంలో చిరకాల మిత్రులైన రజనీకాంత్, కమల్హాసన్లను రాజకీయాల్లోకి రావద్దంటూ సలహా ఇచ్చారు. తమిళ మేగజైన్ ఆనంద వికటన్కు ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నేను సినిమాల్లో నెంబర్ వన్ స్టార్గా రాణిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చాను. అయితే ప్రత్యర్థులు కోట్లు కుమ్మరించడంతో సొంత నియోజక వర్గంలోనే ఓడిపోయాను. నా సోదరుడు పవన్కల్యాన్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పుకొచ్చారు.

నిజమే పవన్ కల్యాణ్ కూడా భీమవరం గాజువాకలో ఓటమిపాలయ్యారు ..అది వారి సొంత నియోజకవర్గాలకు దగ్గర ఊర్లు పైగా సొంత జిల్లా, సో అందుకే మెగా కుటుంబం అది మర్చిపోలేకపోతోంది. సౌమ్యులకు రాజకీయాలు అంత సులువు కాదు అని చిరంజీవి తేల్చిచెప్పారు. ఇక చిరు మాట ఎలా ఉన్నా తమిళ తంబీలు మాత్రం రజనీ కమల్ రాజకీయాల్లో ఉండాలి అని కోరుకుంటుననారు. మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. రజనీ కూడా త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపారు. సో ఆయన పార్టీ కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రారంభిస్తారు..చూడాలి ఈస్టార్ల పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.