
చిరు, పవన్ కాంబినేషన్లో మూవీ ఎలా సాధ్యం రెడ్డి గారూ..?
కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ మెగా మల్టీస్టారర్ మూవీ తియ్యబోతున్నట్టు ప్రకటించారు కళాబంధు, టీ. సుబ్బరామిరెడ్డి. త్రివిక్రమ్ ఈ మూవీకి డైరెక్టర్ అంటూ ఓ ప్రెస్‌నోట్ ను కూడా ఆయన విడుదల చేసారు. ఆ తర్వాత ఆ మూవీ గురించి ఏ సమాచారం లేదు. రీసెంట్ గా ఈ విషయంపై చాలా మంది సుబ్బరామిరెడ్డిగారిని వివరణ కోరారు. దీంతో ఆయన మరోసారి మూవీ తప్పకుండా తెరకెక్కుతుందని క్లారిటీ ఇచ్చారు. పవన్ తో మాట్లాడానని ఆయన ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
అయితే సుబ్బరామిరెడ్డి ఎంత చెపుతున్నా ఈ మూవీ రావడం మాత్రం అనుమానంగానే కనిపిస్తోంది. దీనికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా సుబ్బరామిరెడ్డి చిరంజీవి, పవన్, త్రివిక్రమ్ లలో ఒక్కరికీ కూడా అడ్వాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. పైగా ఈ ముగ్గురూ ఎవరి ప్రాజెక్ట్ ల్లో వారు బిజీగాఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే చేతిలో ఉన్న సినిమాలను ఎలా అయినా పూర్తి చేసి రాజకీయాల్లోకి వెళ్లిపోదామని ఆత్రంగా ఉన్నాడు. ఇప్పటికే అడ్వాన్స్ లు తీసుకున్న మైత్రీ మూవీస్ , ఏఎం రత్నం మూవీలనే ఎలా పూర్తి చేయాలా ? అని పవన్ మధనపడుతున్నాడట. ఇటువంటి పరిస్థితుల్లో సుబ్బరామిరెడ్డి మూవీకి ఎలా కమిట్ అవుతాడు .
మరోవైపు చిరంజీవి విషయం తీసుకుంటే ‘ఖైదీ నెంబర్ 150’ సూపర్ డూపర్ హిట్ అయినా ఇంకా ఆయన తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. కారణం ఫర్ఫెక్షన్ కోసం ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం చేయబోతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర కోసం స్క్రిప్ట్ పనులను దగ్గరుంచి చేయిస్తున్న చిరు త్వరలో ఆ మూవీ షూటింగ్ లో పాల్గొని బిజీ కానున్నాడు. అంటే ఏడాది పాటు చిరంజీవి కూడా దొరకడు. ఇక త్రివిక్రమ్ కూడా పవన్ తో మూవీ తర్వాత ఎన్టీఆర్ తో కమిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇన్ని ఆటంకాలు, అడ్డంకులు నడుమ మెగా కాంబినేషన్ మూవీ ఎలా సాధ్యమవుతుందో సుబ్బరామిరెడ్డి గారే చెప్పాలి.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు