
అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్..సుకుమార్‌తో చిరంజీవి మీట్
Sukumar: ఇటీవలే ‘పుష్ప’ సినిమా వీక్షించిన చిరంజీవి.. ఆ వెంటనే సుకుమార్‌ని ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని చెబుతూ సుక్కు ప్రతిభను కొనియాడారు.
ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ను చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. ఇటీవలే ‘పుష్ప’ సినిమా వీక్షించిన చిరంజీవి.. ఆ వెంటనే సుకుమార్‌ని ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు.Pushpa సినిమా తనకు బాగా నచ్చిందని చెబుతూ సుక్కు ప్రతిభను కొనియాడారు. అన్ని భాషల్లో పుష్ప సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా ఉందని చెప్పిన చిరంజీవి.. సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చాలా బాగుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించిందని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని సుకుమార్‌పై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు.
అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. మొదటిసారి అల్లు అర్జున్ ఊర మాస్ లుక్కులో కనిపించి కిక్కిచ్చారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హాట్రిక్ సినిమాగా ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కెరీర్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. దేశవిదేశాల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్