
అధికారిక ప్రకటన..చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాకు ముహూర్తం ఖరారు
Chiranjeevi – Bhola Shankar : చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాకు ముహూర్తం ఖరారు.. అంతేకాదు అధికారిక ప్రకటన కూడా చేశారు. (Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆషూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. కాగా ఇటీవల ఆచార్య ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.
అది అలా ఉంటే చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ‘గాడ్ ఫాదర్’ సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, బాబీలతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉండగా.. వీటిలో ముందుగా బాబీ సినిమానే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను చిరంజీవి దీపావళి సందర్భంగా నవంబరు 6న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా మంచి మాస్ మసాలా కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘వాల్తేరు వాసు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగతీం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీంతో పాటు ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ తమిళ వేదాళం మూవీకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తమన్నా ఈ సినిమాలో చిరు సరసన నటించబోతున్నట్టు సమాచారం.
Gallery
Latest Updates
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్
-
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
-
ప్రియురాలు ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి స్టోరీ “విక్రమ్ సినిమా”
-
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja
-
అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్..సుకుమార్‌తో చిరంజీవి మీట్
-
Ram Charanతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నా:NTR ..ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే
-
రాజమౌళి:Ram Charan తెల్ల కాగితం లాంటివాడు.. తారక్ గురించి అంతా తెలుసు
-
పూర్ణ ప్రధాన పాత్ర లో నటించిన “బ్యాక్ డోర్” సినిమా రివ్యూ
-
అవన్నీ తెలియదన్న డైరెక్టర్…Radhe Shyam విడుదలపై క్లారిటీ
-
Saamanyudu Teaser