దెందులూరులో చింతమనేనికి కొత్త టెన్షన్

Chintamaneni new tension in Denduluru

ఏమిటి ఈసారి తెలుగుదేశంలో కొందరు సీనియర్లు ఓడిపోతారా ఎందుకు ఇలాంటి దారుణమైన ఫలితాలు వస్తాయి అని కొందరిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ..ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎందరో ఎమ్మెల్యేలు విమర్శలు ఎదుర్కొన్నారు.. మీడియాలో సెన్సేషనల్ పొలిటికల్ స్టార్లు అయ్యారు. ఇక టీడీపీలో అందరి కంటే ముందు వరుసలో ఉంటారు ఈ వివాదాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..ఎక్కువగా మీడియాలో సెన్సేషన ల్ పొలిటికల్ స్టార్ గా మారిపోతారు ఆయన.

ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఎవరి పేరు ఎక్కువగా వినిపించకపోయినా, ఆయన పేరు మాత్రం వినిపిస్తుంది. దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఆయనకు బాబు మరోసారి టికెట్ ఇచ్చారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఇక్కడ వైసీపీ తరపున అబ్బయ్య చౌదరి పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ ఎన్నికల ముందే తన సీటుని ఫిక్స్ చేసుకుని ఎన్నికల్లో పోటి చేశారు.

దాదాపు మూడు మండలాల్లో వార్ వన్ సైడ్ అనేలా ఫలితాలు ఉండబోతున్నాయి అంటున్నారు.. అయితే చింతమనేని తాను మరోసారి గెలుస్తాను అనే ధీమాతో ఉన్నారట, మరి రివ్యూ మీటింగుల్లో కూడా ఇదే విషయం చెప్పారు.. కాని ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని ఆరు సర్వేల్లో తేలింది అట.. అబ్బయ్య చౌదరి సౌమ్యుడు పైగా విద్యావంతుడు , ఫారెన్ నుంచి వచ్చిన విద్యావంతుడు, ఈసారి కొఠారు వారి వారసుడికి అవకాశం ఇద్దాం అని చాలా మంది ఎన్నికలకు ముందే ఫిక్స్ అయ్యారు.

తండ్రి కూడా రాజకీయంగా ఆయన వెంట ఉన్నారు. జిల్లాలో అందరి ఫోకస్ ఉన్న సెగ్మెంట్ ఇదే, అందుకే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇరు పార్టీల నేతల్లో కొత్త టెన్షన్ ఆతృత ఉంది. ఇక్కడ చింతమనేని గెలిస్తే ఆయనది చరిత్ర , వైసీపీ గెలిస్తే చరిత్ర చెరిపివేసినట్టే అనేది జనం చెబుతున్నారు. ఇక పవన్ కూడా చింతమనేని పై ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు. ఈసారి కాపు ఓటు బ్యాంకు చింతమనేనికి దూరం అయింది అనేది తెలుగుదేశం నేతలు సైతం ఒప్పుకుంటున్నారు. సో చూడాలి ఫలితాలు ఎలా ఉంటాయో.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.