
తెలంగాణలో చంద్రబాబు కొత్త ఆఫీస్ అందరూ ఆహ్వానితులే
రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము, జగన్ హైదరాబాద్ విడిచిరాడు అని విమర్శలు చేసిన చంద్రబాబు, ఓటమి వచ్చిన వెంటనే టపాలని హైదరబాద్ వచ్చి పడ్డారు.. నిజంగా వైసీపీ నేతలు చేసిన విమర్శలు నిజం చేశారు చంద్రబాబు, ఎందుకు అంటే ఈసారి చంద్రబాబు ఓడిపోతే చంద్రబాబు హైదరాబాద్ లోకట్టుకున్న నివాసంలో ఉంటారు అని విమర్శలు చేశారు.. నిజంగా అలాగే చేశారు చంద్రబాబు…ఇక జగన్ ఓడినా గెలిచినా అమరావతి వేదికగా ఉంటాను అన్నారు, అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది అప్రస్తుతం అని అనడానికి లేదు, ఎందుకు అంటే గెలిచిన ఆనందం వైసీపీలో ఉంటే, ఓడిన బాధ తెలుగుదేశం అధినేత చేస్తున్న పనులతో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మొత్తం చీపురు పెట్టి తుడిచేశారు చంద్రబాబు అని చెప్పాలి.. మొత్తం కాంగ్రెస్ పార్టీతో జతకట్టి జనాలకు నమ్మకం పోయేలా చేశారు.. శత్రువులుగా ఉన్న పార్టీలు కలవడం కేడర్ ని ఆశ్చర్యానికి లోనయ్యేలా చేశాయి.. ఇక తెలుగుదేశం పార్టీ ని ఇప్పుడు మళ్లీ తెలంగాణలో ఓ స్ధితికి తీసుకువస్తా అని చెబుతున్నారు బాబు, తెలంగాణ టీడీపీని పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేయడానికి ఇక కంకణబద్ధుడనై పనిచేస్తానంటూ చంద్రబాబు వారికి హామీ ఇచ్చేశారు వారు కూడా ఇదేమిటి అనుకునే లోపు ఇక పార్టీ తెలంగాణలో పుంజుకుంటుంది అని చెప్పారు. అందుకోసం వారంలో రెండు రోజుల పాటూ హైదరాబాదులోనే ఉంటూ తెలంగాణ పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తూ ఉంటానని కూడా ఆయన సెలవిచ్చారు. ఇక ఆయన చేసే పోరాటం కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్ పై అనేది తెలిసిందే… ఇక ఇదే సమయంలో ఏపీ నేతలు అప్పుడే టెన్షణ్ పెట్టుకున్నారు నాలుగు జిల్లాలో టీడీపీ అడ్రస్ లేదు మరి ఇప్పుడు బాబు ఎలాంటి రాజకీయం చేస్తారు అనేది ప్రశ్న.
అయితే బాబు హైదరాబాద్ లో ఎలాంటి రాజకీయం చేస్తారు, ఇప్పటి వరకూ జగన్ ని విమర్శించిన బాబు, తానే జగన్ కు అస్త్రం అవుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. మరోసారి బాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి ఇంక సాధించేది ఏమి లేదు అని, అయినా ఆయన పోరాటం కేసీఆర్ జగన్ పై అనేది స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు, అసలు తెలంగాణలో చంద్రబాబు ఈ సమయంలో ఓ మీటింగ్ పెడితే జనం ఎంత మంది వస్తారో, అసలు బాబు చరిష్మా తెలంగాణలో ఎంత ఉందో, కార్యకర్తలు ఎందరు ఉన్నారో దాని బట్టీ తెలంగాణలో టీడీపీ ఎలా ఉందో తెలుస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్