బాలయ్యకు కొత్త వర్క్ అప్ప చెప్పిన చంద్రబాబు లెజెండ్ బీజీ

Chandrababu has given some work to Balakrishna

మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పోలింగ్ తర్వాత కూడా ఎక్కడ ఎవరు మనకు ఓటు వేశారు, ఎక్కడ మనం బలంగా ఉన్నాము, ఇలా అనేక విషయాలలో బేరీజు వేసుకుంటోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికార పక్షంలోకి వస్తుంది అని వస్తున్న సర్వేలలో, ఏది నిజం ఎంత వరకూ వాస్తవం ఉంది అని, అనేక రకాలుగా విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఇక ఎన్నికల్లో ప్రతీ సెగ్మెంట్లో పరిస్దితి ఎలా ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత రిపోర్టులు అన్నీ అమరావతి వచ్చాయి.. బాబు టేబుల్ ముందుకు మొత్తం ఎవరు ఎలా పనిచేశారు అనేది రిపోర్టు తెప్పించుకున్నారు.

ఇక అందరి నేతలతో సమానంగా తన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకి కూడా పని అప్పచెప్పారు చంద్రబాబు. శుక్రవారం టీడీపీ నాయకులతో హిందూపురంలో సమీక్ష నిర్వహించనున్నారు బాలయ్య. ఇందులో భాగంగా శుక్ర, శనివారంలో హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీ ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ నాయకులతో సమావేశం కానున్నారు అని తెలియచేశారు. ఈనెల 11న ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నియోజక వర్గంలోని 2,29,262 ఓటర్లకుగాను 1,77,903 ఓట్లు పోలింగు కాగా 77.60 శాతం పోలింగ్ శాతం నమోదయ్యింది. ఇది రికార్డుగా చెబుతున్నారు అక్కడ నేతలు.

అనేక సర్వే రిపోర్టుల్లో బాలయ్యకు కూడా ఈసారి ఓటమి తప్పదు అని వస్తున్న సందర్బంలో, అక్కడ పార్టీ పరిస్దితి నేతల టాక్ జనాల వాక్కు తెలుసుకోవాలి అని బాబు నిర్ణయించారు. అందుకే అక్కడకు బాలయ్య చేరుకుని అన్నీ తెలుసుకుంటున్నారు.. అయితే పోలింగ్ ముగిసిన రోజు 12వ తేదీన మండలాల వారిగా నివేదిక తెప్పించుకుని ముఖ్యమైన నాయకులతో సమీక్షలు నిర్వహించి తర్వాత బాలయ్య హైదరాబాద్కు వెళ్లారు. ఇటీవల బాబు టీడీపీ నేతలతో అభ్యర్దులతో ఏర్పాటు చేసిన మీటింగులో దానిని సమర్పించారు బాలయ్య.

నియోజకవర్గంలో 256 పోలింగ్ స్టేషన్లలో ప్రతి పోలింగ్ బూత్లో ఎన్నిఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏపార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ముందో అంచనాలు, ఎన్నికల్లో నాయకులు పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు పని చేశారో, ఎవరు పనిచేయలేదో, కుల, వర్గ, సమీకరణలతో తెలిపే నివేదికతో రావాలని నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి బాలయ్యకు కూడా కొత్త వర్క్ ఇవ్వడంతో ఇప్పుడు నేతలు అందరూ ఆలోచనలో ఉన్నారు. పక్కాగా ఎన్ని సీట్లు వస్తాయి అనే వర్క్ లో బాబుబీజీగా ఉన్నారట.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.