
చంద్రబాబు ఓదార్పు- పరామర్శయాత్రలతో బీజీ
యాత్ర అనే టైటిల్ వైసీపీకి బాగా సెట్ అయింది. ఓదార్పుయాత్ర పాదయాత్ర నిజంగా యాత్ర సినిమా అయితే చంద్రబాబు కూడా ఇదేదో బాగుంది అని భావించారు. ఇప్పుడు చేద్దాము అన్నా కుదరదాయే, ఇంకా ఐదు సంవత్సరాలు సమయం ఉంది.. ఇప్పుడే వైసీపీ మొక్క నాటింది, మరి జగన్ కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.. ఏపీలో కొత్తగా సంస్కరణల దిశగా జగన్ కొత్త వేడి పుట్టిస్తున్నారు. అయితే ఈసారి ఓటమి మాత్రం చంద్రబాబుని వదలడం లేదు. డిజాస్టర్ సినిమా వచ్చి నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి పది శాతం కూడా రాకపోతే, ఎంత బాధ ఉంటుందో, అంత బాధ రాజకీయంగా టీడీపీ అధినేత చంద్రాబుకి ఉంది.
అసలు ప్రజల్లో ఇంత వ్యతిరేకతకు కారణం ఏమిటి అని ఆలోచన మాత్రం చేయడం లేదు.. ఇక బాబుకు ఇప్పుడు ఓదార్పు యాత్ర స్టార్ట్ అయింది.. నిజంగా ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మా బాబు అధికారంలోకి రాలేదు అని బాధపడే బ్యాచ్ అందరూ చంద్రబాబు వద్ద కన్నీరు పెట్టుకుంటున్నారు, మినహా ప్రజలు ఎవరూ ఎక్కడా బాబు గెలవలేదు అని బాధపడటం లేదు, ఇక రాజు ఎలా నడిస్తే జనం అలా అని బాబు ఈవీఎంలు అని అంటే అందరూ ఈవీఎంలు తేడా అని అంటున్నారు.
అయితే బాబు మీడియా మాత్రం ప్రజలు అందరూ బాబుకు అధికారం రాలేదు అని బాధపడుతున్నారు అని చెబుతోంది.. మొత్తానికి ఈ ఎల్లో మీడియాలు ఎప్పుడు మారతాయో చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు బాబుని ఎక్కడ చూసినా ఇలా జరిగింది ఏమిటి సార్ అని అడగడం పుండుమీద కారం చల్లినట్టు అయిపోయింది. ఇక నారా లోకేష్ విషయంలో పెద్ద ఎవరూ పట్టించుకోకపోయినా, అసలు చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఫలితాలు చూడలేదు సార్, మీరే అక్కడ గెలిచారు, అందరూ ఓటమిపాలుఅయ్యారు. ఇది మరీ దారుణం సార్ అంటున్నారు పార్టీ నేతలు. అయితే అక్కడ తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఇలాగే పరామర్శ చేశారు చంద్రబాబుని, ఇక ఎన్టీఆర్ పుట్టినరోజున కూడా ఇదే చేశారు, ఇలా ప్రతీ సారి తెలుగుదేశం నేతలు చంద్రబాబుని ఓదార్చడానికి మాత్రమే వీలు చూస్తున్నారు అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయ్యాక, మూడు నెలల తర్వాత బాబు రంగంలోకి దిగాలి అని చూస్తున్నారు .. ఇక నేతలను కలిసి ఓ దార్పు యాత్రలకు పరామర్శలకు అవకాశం ఇవ్వకూడదు అని భావిస్తున్నారట. దీంతో ఎంత కష్టం వచ్చింది బాబుగారికి అంటున్నారు టీడీపీ నేతలు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్