కేసీఆర్ కు జగన్ కు షాక్ ఇస్తానంటున్న బాబు

Chandra Babu is giving shock to KCR and YS Jagan

బిత్తిరి బిత్తిరి మాటలు మాట్లాడితే పనులు సక్కగా సాగవు అని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అంటారు, ఓమాటమీద ఉన్నాము అంటే అది జరిగి తీరాలి అదే ఏపీ సీఎం జగన్ స్టైల్, అయితే వీరిద్దరి మాటలకు భిన్నంగా ఉంటాయి మాజీ సీఎం చంద్రబాబు మాటలు…ఎన్నికల్లో ఇచ్చిన హమీలు గురించి కూడా పట్టిచుకోరు బాబు అని గత ఎన్నికల్లో ప్రజలు కూడా భారీగా ఓటమి ఇచ్చారు… అయితే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోస్టర్ కనిపించడం లేదు, ఏపీలో మాత్రం 23 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, మరి బాబు వెంట నేతలు ఏపీలో ఎవరు ఉంటారా ఏమా పార్టీ కధ అనేది ఇంకా ఏమీ చెప్పలేనిది.. ఈ సమయంలో తెలంగాణలో తమకు కాంగ్రెస్ కు మళ్లీ సంబంధం లేదు అనేలా బాబు కొత్త ప్లాన్ వేస్తున్నారట.

అక్కడ కేసీఆర్ జగన్ కలిసి హుజూర్ నగర్ లో జోడీ అవుతున్నారు కదా, మరి మనం పోటీ చేద్దాం అని తెలంగాణ సైకిల్ తమ్ముళ్లు బాబుదగ్గరకు వెళ్లారు.. అయితే బాబు కూడా ఆలోచించారు , ఇక్కడ ఒకవేళ గెలిస్తే ఏకంగా మోదీ కూడా మనల్ని చూసి భయపడిపోతాడు అని భావిస్తున్నారట బాబు.. అందుకే ఇక్కడ అభ్యర్దిని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట చంద్రబాబు.

టీఆర్ ఎస్ అధినేత – సీఎం కేసీఆర్ తమ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరు ప్రకటించారు. సైదిరెడ్డి గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి 7 వేల ఓట్ల తేడాతో ఓడినా గట్టిపోటీ ఇచ్చారు. మరి ఉత్తమ్ భార్య పద్మవతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక టీడీపీ తరపున పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డితో పాటు హుజూర్ నగర్ మాజీ ఎంపీపీ చావా కిరణ్మయి పేర్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ టీడీపీ తమకు మద్దతు ఇవ్వాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు రిక్వెస్ట్ చేశారు. టీడీపీ మాత్రం ఇక్కడ పోటీ చేసి తమ బలం ఎంతో టెస్ట్ చేసుకునే పనిలో ఉంది. చూడాలి మరి బాబు ఓసారి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే ఎట్లా ఉంటదో.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.