
ఛలో మూవీ రివ్యూ
నిర్మాణ సంస్థ : ఐరా క్రియేషన్స్
తారాగణం: నాగశౌర్య, రష్మిక మండన్నా, సీనియర్ నరేష్, పోసాని కృష్ణమురళి తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: సాగర్ మహతి
చాయాగ్రహణం: సాయిశ్రీరామ్
నిర్మాత : ఉషా ముల్పూరి
దర్శకత్వం: వెంకీ కుడుముల
ఇంట్రో
ఊహలు గుసగుసలాడే సినిమాతో తొలి సక్సెస్ ను అందుకున్నాడు నాగ శౌర్య….దిక్కులు చూడకు రామయ్యా, జాదూగాడు, కల్యాణ వైభోగమే, ఒక మనసు, జో అచ్యుతానంద వంటి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు శౌర్య.. అయితే అనుకున్నంత విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు నాగ శౌర్య. ఇక బయట చిత్రాలు కాకుండా స్వతంగా తానే ఐరా క్రియేషన్స్ నిర్మాణ సంస్ధను స్టార్ట్ చేసి వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. ఆ సినిమాయే ఛలో నేడు విడుదల అయిన ఆ సినిమా ఎలా అలరించిందో చూద్దాం.
కథ
చిన్న పిల్లల మనస్తత్వం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ నేపథ్యానికి భిన్నంగా ఉండే పిల్లాడు హరి !! నాగశౌర్య!! చిన్నపిల్లాడైనా ఎవరైనా గొడవలు పడుతుంటే చూడాలనుకునే విపరీత మనస్తత్వం హరిది. దీంతో హరి తండ్రి !! సీనియర్ నరేశ్!! తనని తిరుపురం అనే ఊరుకి పంపేస్తాడు. హరి అక్కడే పెరిగి పెద్దవుతాడు. తిరుపురం ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది. ఆ ఊళ్లో తెలుగువారు, తమిళులు ఎందుకనో కంచె వేసుకుని గొడవలు పడుతుంటారు. హద్దు దాటి ఎవరూ రారు. అలా వస్తే సంప్రదాయంగా చంపేసుకుంటూ ఉంటారు.
తిరుపురం కాలేజీలో చదువుకున్న హరి కార్తీక !! రష్మిక మండన్నా!! ను ప్రేమిస్తాడు. తెలుగువాడైన హరిని చంపాలనుకుంటారు తమిళులు అయితే హరి తప్పించుకుంటాడు. తమ ప్రేమ గెలవాలంటే రెండు వర్గాలు కలవాలనే నియమం పెడుతుంది కార్తీక. అప్పుడు హరి ఏం చేశాడు అక్కడ ఇరువర్గాలు హరి మాట విన్నారా ఆమె ప్రేమను సాధించుకున్నాడా అనేది వెండి తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
నాగశౌర్య నటన అద్బుతంగా ఉంది అని చెప్పవచ్చు సినిమాలో సీనియర్ నటులు నటన బాగుంది లుక్స్ బాగున్నాయి.. రష్మికకు తొలిచిత్రం అయినా తన నటనతో మెప్పించింది..సీనియర్ నరేష, ప్రగతి, రాజేంద్రన్, ప్రవీణ్, మైమ్ గోపీ, వైవా హర్ష, పోసాని కృష్ణమురళి, రాకెట్ రాఘవ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో కామెడి పండించారు వెన్నల కిషోర్ ,సత్య… మ్యూజిక్ బాగుంది.అసలు గొడవలు పడే కుమారుడ్ని గొడవలు ఎక్కువగా ఉండే ఊరికి తండ్రి ఎందుకు పంపుతాడు అనే లాజిక్ దర్శకుడు మిస్ అయ్యారు అని సగటు ప్రేక్షకుడ్ని ఆలోచింప చేస్తుంది.. ఇక పాటలు సినిమాకు హైలెట్ దర్శకుడు బాగానే తెరకెక్కించారు చిత్రాన్ని
బలాలు:
హీరో హీరోయిన్ పాత్రలు
సినిమాటోగ్రఫీ
మాటలు,
సంగీతం
బలహీనతలు
బలమైన కథ లేకపోవడం
లాజిక్ లేని సన్నివేశాలు
సెకండాఫ్ స్లో నేరేషన్
రేటింగ్ 2.5