భూమా అఖిలప్రియ భర్త పై కేసు
ఏపీ మాజీ మంత్రి ఆళ్లగడ్డ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు ఇప్పుడు ఎదురు చిక్కులు వచ్చి పడ్డాయి.
వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు.. జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు.
అయితే వ్యాపారంలో వివాదాలు రావడంతో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తన భర్తపై హత్యాయత్నం చేసినట్లు శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈకేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
15 రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 14వ తేదీన భార్గవ్‌రామ్, అతడి అనుచరులు ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి అక్కడున్న వారిని తరిమేసి తాళాలు వేశారని, 27వ తేదీన మరో పరిశ్రమను స్వాధీనం చేసుకుని రెండింటిని తమపేరిట రాసివ్వాలని డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి ఒప్పుకోని తన భర్తని చంపుతామని హత్య చేస్తామని బెదిరించారని పోలీసులకు ఆమె ఫిర్యాదు
చేశారు.దీంతో భార్గవ్‌రామ్‌తో పాటు మరో 10మందిపై ఆళ్లగడ్డ ఎస్ఐ రమేష్‌కుమార్ కేసు నమోదు చేశారు. వీరిలో మహేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని, సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత భార్గవ్రామ్పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇక భూమా అఖిలప్రియ ఎన్నికల్లో కూడా తన భర్తతోనే ఎన్నికల ప్రచారం చేశారు.. ఏవీ సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి అండగా ఉండేవారు, కాని అఖిల మాత్రం ఆయనని పక్కన పెట్టింది. ఇప్పుడు భూమా ఫ్యామిలీ మొత్తం వ్యవహరాలు భార్గవ్ రామ్ చూసుకుంటున్నారు అని తెలుస్తోంది.
Recent News
Latest News
-
పవన్ నమ్మిన నాయకుడు జనసేనకు గుడ్ బై
-
భూమా అఖిలప్రియ భర్త పై కేసు
-
సైరా సక్సస్ పై చిరంజీవి చరణ్ ట్వీట్
-
మోహన్ బాబు ట్వీట్ ని మెగా అభిమానులు ఏం చేశారంటే
-
సైరా మూవీ రివ్యూ
-
కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం కూల్చడం కరెక్టా కాదా?
-
సైరా మొదటి రివ్యూ సూపర్ హిట్టు
-
ప్లీజ్ ఆపరేషన్ వద్దు పవన్ కల్యాణ్ ఎందుకంటే
-
వేణుమాధవ్ కోసం వెన్నెల కిషోర్ ఏం చేశారంటే
-
బ్యాంకుల టైమింగ్స్ మారిపోయాయి ఇవే
-
చిరంజీవితో చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్
-
పవన్ ని టార్గెట్ చేస్తున్నారుగా బీజేపీ కొత్త ప్లాన్
-
కేసీఆర్ కు జగన్ కు షాక్ ఇస్తానంటున్న బాబు
-
టిక్ టాక్ మోజుతో ప్రియుడితో జంప్ అయిన కొత్త పెళ్లి కూతురు
-
సమజవరాగమనా సాంగ్ – ఆలా వైకుంఠపుర్రములూ