జనసేనలో చేరిన నాయకర్
గోదావరి జిల్లాల్లో జనసేన మంచి జోరుమీద వెళుతోంది, ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు వైసీపీ నుంచి టీడీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరుతున్నారు.. అంతేకాదు జనసేన పార్టీలో చేరుతున్న వారిలో మాజీ మంత్రుల- ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండటంతో పార్టీ ఇంకెంత జోష్ మీద వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా మారుతుందో అనే ఆలోచన నేతల్లో కనిపిస్తోంది…టీడీపీ సీనియర్ నాయకులు, మత్స్యకార సామాజికవర్గ రాష్ట్ర నాయకుడు బొమ్మిడి నాయకర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇక బీసీ సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన, పార్టీకి రాజీనామా చేయడంతో టీడీపీకి చాలా పెద్ద ఓటు బ్యాంకు ఇచ్చే నాయకుడు పార్టీని వీడినట్లు అయింది.
ఇక తెలుగుదేశంలో అందరితో సయోధ్యగా ఉండే నాయకర్ , తన రాజీనామాను జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి ప్యాక్స్ పంపానన్నారు. 12 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నా..పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచా. అధికారంలోకి వస్తే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఇస్తారన్న హామీ ఇచ్చారు…కానీ నాలుగున్నర ఏళ్లు గడిచినా సరైన గుర్తింపు ఇవ్వలేదు. ఆర్థికంగా నష్టపోయా,ఇంకా పార్టీలో కొనసాగితే భవిష్యత్ ఉండదనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. ఇక ఆయన జనసేనలో చేరుతారు అని గత నెలరోజులుగా వార్తలు వినిపించాయి.. చివరకు ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో పాటు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన కూడా చేశారు.
గతంలో బొమ్మిడి నారాయణరావుకు ఎమ్మెల్సీ పదవిఇచ్చింది. ఖాళీ అయిన తరువాత ఆ పదవిని తిరిగి ఆదే సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఈ విషయం కూడా నన్ను బాధించింది. కార్పొరేషన్ చైర్మన్ల్లోనూ మా సామాజిక వర్గానికి సరైన పదవి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవన్ని ఆలోచించి పార్టీని వీడాను అని తన మనసులో మాట తెలియచేశాడు నాయకర్.జనసేన సిద్దాంతాలు బాగున్నాయి పవన్ తో చర్చించామని, ఆయనతో కలిసి ముందుకు వెళతాము అని, అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఆయన తెలియచేశారు. త్వరలో జనసేనలో చేరుతాను అని చెప్పారు నాయకర్.
Recent News
Latest News
-
లక్ష్మిస్ ఎన్టీఆర్ ట్రైలర్
-
జెట్ స్పీడులో దూసుకుపోతున్న నాదెండ్ల మనోహర్
-
జనసేన తొలిగెలుపు ఈ సెగ్మెంట్ నుంచే
-
సిట్టింగ్ ఎమ్మెల్యేకా – మాజీకా జగన్ స్టెప్ ఏమిటి?
-
ఈ సెగ్మెంట్లో పవన్ కు తిరుగేలేదు
-
ప్రకాశంలో జనసేన ఆరు సీట్లు ఫిక్స్
-
పవన్ ముందు వామపక్షాలు పెట్టిన లిస్టు ఇదే
-
ముగ్గురి పేర్లు ప్రకటించిన పవన్ కల్యాణ్
-
Mr. మజ్ను మూవీ రివ్యూ
-
ఆకుల సత్యనారాయణ కు పవన్ బంపర్ ఆఫర్
-
జనసేన తొలిజాబితాలో వీరికి చోటు
-
ఉత్తరాంధ్రా పై పవన్ స్పెషన్ ఫోకస్
-
జనసేనలో చేరిన నాయకర్
-
జనసేనలోకి రాధా ముహూర్తం ఫిక్స్
-
వైసీపీకి బారి షాక్ రాజీనామా చేసిన వంగవిటి రాధా! 2 న జనసేన లో చేరిక