పవన్ ని టార్గెట్ చేస్తున్నారుగా బీజేపీ కొత్త ప్లాన్

BJP's new plan to target Pawan Kalyan

జనసేన పార్టీని ఆది నుంచి తుంచి వేయ్యాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు, అయితే అది కుదరలేదు, అసలు కేడర్ లేదు సినిమాలు చేసే పవన్ కల్యాణ్ రాజకీయాలు ఏం చేస్తాడు, పవన్ పార్ట్ టైం పొలిటీషియన్, ఇక రాజకీయాల్లో ఫెయిల్ అయితే సినిమాలే చేస్తాడు, ఇలా పవన్ తొలి అడుగు వేసిన సమయం నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఇక ఏ పవన్ ని అయితే పక్కన పెట్టుకుని పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికల్లో విజయం సాధించారో, అదే తెలుగుదేశం బీజేపీ రెండు పార్టీలు పవన్ ని పక్కన పెట్టాయి.

పవన్ వల్ల తాము గెలవలేదు, పవన్ కు మాకు సంబంధం లేదు అని విమర్శించారు, ఇక పవన్ కీలు బొమ్మ బాబు ఏం చెబితే అది చేస్తారు అంటూ టీడీపీకి పవన్ దోస్తీ స్టార్ అంటూ, వైసీపీ విమర్శించింది. అయితే పవన్ మాత్రం రాజకీయంగా ఓటమి వచ్చినా సినిమాలు చేయడం లేదు, ఆయన రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. అయితే రాజకీయంగా పవన్ మాత్రం తాను బ్యాక్ స్టెప్ వేయను అని ఇప్పటికే ప్రకటన చేశారు.

తాజాగా ఏపీలో బీజేపీ కూడా బలంగా అవ్వాలి అని చూస్తోంది.. ఈ సమయంలో పవన్ ని కూడా ఆ పార్టీ టార్గెట్ చేసింది..బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు పవన్ పై సంచలన కామెంట్లు చేసారు. పవన్ ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోలేడని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చెయ్యడని మధ్యలో ఆపేస్తాడని సంచలన కామెంట్స్ చేసారు. అయితే ఆయన కామెంట్ల పై జనసేన వర్గాలు విమర్శిస్తున్నాయి.

పవన్ కు వచ్చిన ఓట్లలో కూడా వారి సామాజికవర్గ వర్గ ఓట్లే ఎక్కువ వచ్చాయని అంతకు మించి ఏమి లేదని వ్యాఖ్యానించారు ఆయన .అయితే ఇక్కడ బీజేపీ గమనించాల్సింది ఒకటి ఉంది. పవన్ కు మీ కంటే ఓట్లు ఎక్కువ వచ్చాయి. అంటే కేవలం కాపు సామాజిక వర్గం ఒక్కరే వేస్తే అన్ని ఓట్లు సాధించలేరు కదా, పవన్ కు అందరూ ఓట్లు వేశారు ఆయన అభిమానులు కేవలం కాపులు మాత్రమే కాదు కదా, బీజేపీ ఇప్పటికైనా ఇది గుర్తించాలి అంటున్నారు జనసేన అభిమానులు, అయితే రాజకీయాల్లో ఉండరని చెప్పే బీజేపీ నేతలు ఇంత మంది ఉండి కూడా సాధించలేని ఓటు బ్యాంకు పవన్ సాధించాడు … అంటే పవన్ పై ప్రజల్లో నమ్మకం ఉంది . సో బీజేపీ కూడా పవన్ తమకు పోటీ అవుతాడు అని భావించి ఆయనని టార్గెట్ చేసింది అంటున్నారు జనసేన అభిమానులు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.