సోము వీర్రాజు స‌రికొత్త ప్లాన్ 

BJP Leader Somu Veera Raju is the newest plan

ఏపీలో బీజేపీ ని  తెలుగుదేశం పార్టీ ఎట్టి ప‌రిస్దితుల్లో ఎద‌గ‌నీయ‌డం లేద‌ని తెలుగుదేశం పార్టీ ప్ర‌తీ ఎన్నిక‌లో త‌మ‌ని మోసం చేస్తోంద‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు… ముఖ్యంగా బీజేపీ నేత‌లు అంద‌రూ ఎలా ఉన్నా? ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం తెలుగుదేశం పై ఫైర్ అవుతున్నారు…. తాజాగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోసారి తెలుగుదేశం పై ఫైర్ అయ్యారు….  రాష్ట్ర వ్యాప్తంగా తాము ఎదుగుతామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలియ‌చేశారు.. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు తాము ఏపీలో బలపడటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని ఆయన మండిపడ్డారు.. 

 

ఆంధ్రప్రదేశ్‌లో బూత్‌ స్థాయి నుంచి బీజేపీని అభివృద్ధి పరుస్తామని  ఆయ‌న తెలియ‌చేశారు.. గ‌తంలో తెలుగుదేశాన్ని న‌మ్మామ‌ని అలాగే న‌మ్మి తే  2014లో తమకు టీడీపీ 14 సీట్లు మాత్రమే ఇచ్చి, అందులో నాలుగు చోట్లే గెలిచేటట్టు చేశారని అన్నారు. ఇండిపెండెంట్లను పోటీకి దింపి తమను దొంగ దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
తాము బలపడుతున్న ప్రతీసారి ప్రత్యేక హోదాను తెరపైకి తెస్తున్నారని గుర్తు చేసిన ఆయన, హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలని చంద్రబాబే అన్నారని స్పష్టం చేశారు. హోదా ఇస్తే ఏటా రూ.3వేల కోట్ల చొప్పున రూ.15వేల కోట్లే వచ్చేవని.. కానీ ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.2లక్షల 10వేల కోట్లు ఇస్తున్నామని  ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు…. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంట్ ఉండేది కాదని, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కరెంట్‌ పోలేదని ఆయ‌న ఎద్దెవా చేశారు. బీజేపీ ఎన్ని సాయాలు చేసినా ఏమీ చేయ‌డం లేద‌ని తెలుగుదేశం నాయ‌కులు అంటున్నారు అని ఆయ‌న ఫైర్ అయ్యారు..

 

సోమవారాన్ని చంద్రబాబు పోలవారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.. ఏపీలో మ‌రి  మిగతా ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్ర‌శ్నించారు… పోలవరం పూర్తి చేయాలని నిశ్చయం తోనే కేంద్రం ఉందని, అందుకే ముందు ముంపు మండలాలను ఏపీలో కలిపిందని అన్నారు…. విభజన సమయంలో ఏపీకి ఏం కావాలనేది మాట్లాడింది ఒక్క వెంకయ్యనాయుడేనని, టీడీపీ ఎంపీలు మాత్రం నోటీకి గుడ్డలు కట్టుకొని ప్లకార్డులు ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఏం కావాలనే విషయం ఏ టీడీపీ నేత చెప్పలేదని  గ‌తాన్ని గుర్తు చేశారు.త‌మ‌ని ఎద‌గ‌కుండా ఏపీలో తెలుగుదేశం కుట్ర‌ప‌న్నుతోంద‌నే భావంతో వీర్రాజు కామెంట్లు చేశారు.. దీంతోతెలుగుదేశం పార్టీలో నాయ‌కులు దిగాలు చెందుతున్నారు.. త‌మ‌పై వీర్రాజు  క‌క్ష‌క‌ట్టార‌ని త‌మ‌పై అనేక అభాండాలు వేస్తున్నారు అని ఎదురు దాడికి దిగుతున్నారు..

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.