
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీరుబాటిళ్లతో దాడి జరిగింది, దీంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు, ఎవరి జోలికి వెళ్లని రాహుల్ పై ఇలా దాడి జరగడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు, అయితే తాజాగా ఆయన తప్పు లేదని కావాలనే ఆయనపై దాడి జరిగింది అని అక్కడ కొందరు తెలుపుతున్నారు. ఆయనకు ప్రాణాపాయం లేదు కాని చికిత్స తీసుకుంటున్నారట.
రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రాహుల్ తన స్నేహితులు, ఓ గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో వాగ్వివాదం మొదలైంది. అది మరింత ముదరడంతో ఇరు వర్గాలు దాడులకు దిగాయి.
దీంతో అవతల వర్గం వారు రాహుల్ ని ముందు కొట్టారు తర్వాత పక్కన ఉన్న బీరు సీసాతో ఆయన తలపై కొట్టారు, దీంతో రాహుల్ కు తీవ్రంగా రక్తస్రావం అయింది, వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు, అయితే రాహుల్ సిప్లిగంజ్‌పై దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు చెప్పనున్నారు పోలీసులు.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు