ఆగస్టులో చంద్రబాబుకు బిగ్ షాక్

Big shock to Chandrababu in August

తెలుగుదేశం పార్టీలో గుబులు మొదలైంది.. ఆ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు కు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఓ పక్క కోడెల కుటుంబం టార్గెట్ అవడంతో మరింత మంది టెన్షన్ పడుతున్నారు.. ఇప్పుడు అన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అని గతంలో మన వాళ్లు చేసిన పనులు ఇప్పుడు మనకు రివర్స్ అవుతున్నాయి అని బాబుకు అర్ధం అయింది.. ఇక ఈ సమయంలో తెలుగుదేశం నేతలను టార్గెట్ చేస్తున్నారు అని విమర్శలు చేయడం మినహా బాబు చేసేది ఏమీ లేదు.. ఇక కేంద్రంలో కూడా బాబు వైరిగా ఉన్న మోదీ అధికారంలో ఉన్నారు.

అందుకే ఏమీ చేయలేని పరిస్దితి… అయితే జగన్ దూకుడు అస్సలు తగ్గడం లేదు, ఆయన మాత్రం అమరావతి భూములు వ్యవహారం వదలను అని చెబుతున్నారు.. రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు అని విమర్శలు చేస్తున్నారు, ముఖ్యంగా టీడీపీ నేతలు కూడా జగన్ దూకుడుకు భయపడుతున్నారు. ఎలాగైనా మనకు చిక్కులు తప్పవు అని చెబుతున్నారు. బాబు బినామీలుగా జగన్ కూడా పలువురి పేర్లు గతంలో తెలియచేశారు. వారిని టార్గెట్ చేయనుంది ప్రభుత్వం. ఎందుకంటే వందలాది ఎకరాల క్రయ విక్రయాలు జరిపారు అని తెలుస్తోందట.

రాజధాని ప్రాంతం ప్రకటనకు ముందు మూడు నెలల ముందు ఇక్కడ ఎలాంటి క్రయ విక్రయాలు జరిగాయి అనే లిస్ట్ డేటా మొత్తం జగన్ ఇప్పటికే అధికారులను ఇవ్వమని కోరారు.. అయితే జగన్ ఇప్పుడు ఇది పట్టించుకోరు అని బాబు భావించారు, కాని సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆగస్టులో బాబు రాజధాని భూముల వ్యవహారంలో ఎలాంటి డీల్ చేశారు అనేది వైసీపీ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టనుందట, మొత్తం మీడియా ముఖంగా ఈ అవినీతిని బయటపెట్టడానికి పక్కాప్లాన్ లో ఉందట జగన్ సర్కారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.