
యువత లో స్ఫూర్తిని నింపే చిత్రం భగత్ సింగ్ నగర్
నటీనటులు – విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, అజయ్ గోష్, ప్రభావతి తదితరులు
టెక్నీషియన్స్ – సంగీతం – ప్రభాకర్ దమ్ముగారి, సినిమాటోగ్రఫీ – రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, ఎడిటింగ్ – జియాన్ శ్రీకాంత్, నిర్మాతలు – వాలాజ గౌరి, రమేష్ ఉడత్తు, రచన దర్శకత్వం – వాలాజ క్రాంతి
స్టోరీ :
భగత్ సింగ్ నగర్ ఒక మురికివాడ. ఈ వాడలో స్నేహితులతో కలిసి సరదాగా తిరిగే కుర్రాడు శ్రీను ( విదార్థ్). ఈ గ్యాంగ్ లో చంద్రయ్య (ముని చంద్ర) అనే తాత కూడా ఉంటాడు. అతని ఇంట్లో పెరిగే అమ్మాయి లక్ష్మి (దృవీక). శ్రీను లక్ష్మిని ఇష్టపడుతుంటాడు. లక్ష్మి కి కూడా శ్రీను అంటే ప్రేమే. చంద్రయ్యతో సహా స్నేహితులతో కలిసి శ్రీను పనిచేస్తూ, సాయంత్రం మందు కొడుతుంటాడు. భగత్ సింగ్ నగర్ లో మద్యపానానికి అలవాటై కుటుంబాలు పాడు చేసుకుంటున్న కొందరిని చూసి శ్రీను మందు మానేస్తాడు. ఎక్కడైనా గొడవలు జరిగితే ఆపేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో భగత్ సింగ్ నగర్ లో కొందరు అమ్మాయిలు అపహరణకు గురవుతుంటారు. ఇలా కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఏమవుతున్నారో చంద్రయ్య తెలుసుకుంటాడు. కానీ ఈ విషయం ఎవరకి చెప్పడు. శ్రీను లక్ష్మి ల పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకుని పెళ్లి జరిగే సమయానికి లక్ష్మిపై కొందరు హత్యాచారం చేస్తారు. అడ్డుకున్న శ్రీను కూడా చంపేస్తారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై మూసేసిన ఈ కేసుపై డాక్యుమెంటరీలు తీసుకునే యువకుడు భగత్ పోరాటం మొదలుపెడతాడు. అమాయకులపై జరిగిన ఘోరాలకు ఎమ్మెల్యే వైసీ రావు (అజయ్ ఘోష్ ) ఉన్న సంబంధం ఏమిటి ఈ గ్యాంగ్ పై భగత్ (విదార్థ్) చేసిన న్యాయపోరాటం ఫలించిందా. శ్రీను, లక్ష్మిల హంతకులకు శిక్ష పడిందాం. భగత్ పోరాటానికి అనన్య (దృవీక) ఎలా హెల్ప్ చేసింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
భగత్ సింగ్ నగర్ సినిమా టైటిల్స్ లోనే దేశ భక్తుల ఫొటోలు, అన్యాయాలపై పోరాటం చేసిన ధీరుల చిత్రాలను చూపించారు. తప్పు జరిగితే తిరగబడాలనే స్ఫూర్తిని సినిమా ఆరంభం నుంచే కలిగించారు దర్శకుడు వాలాజ క్రాంతి. సొసైటీ మారాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలనే ఆలోచన రేకెత్తించారు. భగత్ సింగ్ నగర్ లో జరిగే అన్యాయాలపై శ్రీను తిరగబడటం చూస్తే ఇదే ఇన్స్ పిరేషన్ కలుగుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్లు మారాలంటే ముందు మార్పు తనలో రావాలనే మద్యపానం మానేస్తాడు శ్రీను. తన వాడలో ఎవరు మహిళలను కించపరిచినా వారికి తగిన బుద్ధి చెబుతాడు. ఇలా హీరోయిజంతో సినిమా సాగుతూనే, శ్రీను లక్ష్మిల మధ్య క్యూట్ లవ్ స్టోరీ చూపించారు దర్శకుడు క్రాంతి.
నటీనటుల్లో శ్రీను, భగత్ రెండు క్యారెక్టర్స్ లో వేటికవి భిన్నంగా నటించారు విదార్థ్. శ్రీనుగా స్లమ్ బాయ్ గా సహజంగా కనిపించిన విదార్థ్…డాక్యుమెంటరీ మేకర్ గా సిటీ కుర్రాడిగా మారిపోయాడు. లక్ష్మి, అనన్య పాత్రల్లో దృవీక కూడా అటు సంప్రదాయంగా, ఇటు మోడరన్ గా నటించి మెప్పించింది. ఎమ్మెల్యే సీవీఆర్ క్యారెక్టర్ లో రాజకీయ నాయకుడిగా నేచురల్ పర్మార్మెన్స్ చేశాడు అజయ్ ఘోష్. అతనికి ఇలాంటి క్యారెక్టర్లు కొట్టిన పిండి. కథలో ట్విస్ట్ ఉన్న క్యారెక్టర్ చేసి షాక్ ఇచ్చాడు రవి కాలె. బెనర్జీ చేసిన ఎస్ ఐ క్యారెక్టర్ చూస్తే ఆడియెన్స్ కోపం వచ్చేంత క్రూరంగా సాగుతుంది. ఇలా పాత్రలన్నీ మనలో రెస్పాన్స్ కలిగించి, మన ముందో కథ జరుగుతుందన్నంత సహజంగా సినిమా వెళ్తూ ఉంటుంది.
సాంకేతిక నిపుణులకు ఈ మంచి కథకు తమ వంతు సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ లాంటి విభాగాల్లో భగత్ సింగ్ నగర్ సినిమా మంచి క్వాలిటీగా ఉంది. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ మేకింగ్ వ్యాల్యూస్ కథకు తగినట్లు ఉన్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్లతో పాటు ‘చరిత చూపని’ సాంగ్ ఆకట్టుకుంది. ఇలాంటి మంచి సందేశాత్మక సినిమా చేసిన నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు ప్రశంసనీయులు. దర్శకుడు వాలాజ క్రాంతికి భగత్ సింగ్ నగర్ తో మంచి అప్రిషియేషన్స్ రావడం ఖాయం.
రేటింగ్ 3.25/5