ఫలితాలకు ముందే బాబుకు షాక్ స్టే ఎత్తేసిన కోర్టు

Before Election results shock to Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ఉన్న కేసుల విషయంలో ఎలాంటి విచారణ జరుగకుండా కేసులపై స్టేలు తెచ్చుకుంటారు అని అభియోగాలు వినిపిస్తూ ఉంటాయి ..తాజాగా ఇప్పుడు ఇలాంటి విమర్శలలో ఓ కేసు స్టే గురించి చర్చ తగ్గనుంది. టిడిపి అధినేత చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ తిరిగి ప్రారంభం కానుంది. గతంలో చంద్రబాబుపైన ఏసిబి కోర్టులో నమోదైన కేసులో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో ఆయనకు హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇలా స్టేల విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకుంది.కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఏకేసుపైన అయినా స్టే తెచ్చుకుంటే అది కేవలం ఆరు నెలల స్టే సమయం ఉంటుంది అని చెప్పింది. ఇలా ఆరునెలల కాలం దాటిన కేసుల్లో స్టే వెకేట్ అవుతుంది అని తెలియచేసింది. ఈ తీర్పుతో ప్పుడు ఈ కేసులో తిరిగి విచారణ ప్రారంభమైంది.

ఇది ఎన్నికలు ముగిసిన తర్వాత రావడం టీడీపీకి కలిసి వస్తే ఫలితాల ముందు రావడం వైసీపీకి మరింత కలిసి వచ్చింది అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల సమయంలో వచ్చి ఉంటే వైసీపీ ఇది కూడా ప్రచారంలో ఉపయోగించుకునేది.. ఇప్పటి వరకూ ఇలా స్టేల గురించి విమర్శలు చేస్తున్న పార్టీలు ఇప్పుడు ఈ కేసు పై విచారణ ఎదుర్కోవాలి అని అంటున్నారు… అసలు కేసు విషయానికి వస్తే ? 2005లో లక్ష్మీపార్వతి చంద్రబాబు ఆస్తుల పై విచారణ జరిపించాలి అని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఆనాడు పెద్ద సంచలనం అయింది. దేశంలోనే సీఎంలలో అత్యంత ధనవంతుడిగా సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఈకేసు విచారణ జరిపితే కచ్చితంగా కొన్ని కీలక విషయాలు బయటపడతాయి అంటున్నారు వైసీపీ నేతలు.

ఈ కేసు ఫైల్ చేసిన లక్ష్మీపార్వతి కోర్టుకు హాజరుకావాలని, లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఆమె కోర్టుకు హాజరయ్యారు. కేసు స్టేటస్పై వచ్చేనెల 13న హైదరాబాద్ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పుడు టీడీపీ నేతలకు ఇది మరింత తలనొప్పి తెచ్చిపెడుతోంది అంటున్నారు. అయితే మిగిలిన కేసుల్లో కూడా స్టేలు వెకేట్ అవుతాయి అంటున్నారు వైసీపీ నేతలు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.