బందోబస్త్ రివ్యూ

Bandobast review

నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్
నటీనటులు: సూర్య, మోహన్లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు
రైటర్స్: పి.కె.పి, శ్రీరామకృష్ణ
పాటలు: వనమాలి, చంద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె.కిరణ్
ఎడిటర్: ఆంటోని
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.ప్రభు
సంగీతం: హేరీష్ జైరాజ్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: కె.వి.ఆనంద్

!!ఇంట్రో!!
తమిళ తెలుగు ప్రేక్షకులకు హీరో సూర్య బాగా దగ్గరైన హీరో.. గజినీ సింగం సిరీస్ చిత్రాలు అతని స్దాయిని ఎక్కడికో తీసుకువెళ్లాయి.. సూర్యతో సినిమా అంటే బిజినెస్ బాగానే జరుగుతుంది అనే పేరు అయితే సూర్య సంపాదించుకున్నాడునిర్మాతల దగ్గర… ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సూర్య సినిమాలు ఎంచుకుంటున్నారు.తాజాగా సూర్య, కె.వి.ఆనంద్తో చేసిన కాప్పాన్ చిత్రాన్ని తెలుగులో బందోబస్త్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కంటే ముందే కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వీడొక్కడే, బ్రదర్స్ చిత్రాలు చేశారు. మరి వీరు హ్యాట్రిక్ అందుకున్నారా సినిమా ఎలా ఉంది ఓసారి చూద్దాం.

కథ:
పాకిస్థాన్లోని కెమికల్ వెపన్స్ను ధ్వంసం చేసిన మిలటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రవికాంత్(సూర్య)అక్కడి తప్పించుకుని ఇండియా చేరుకుంటాడు. ఓ ఆంధ్ర ప్రాంతంలో ఉండి.. అక్కడ నుండి చంద్రకాంత్(మోహన్లాల్) ప్రధానిని కాపాడే మిషన్ మీద లండన్ చేరుకుంటాడు. అక్కడ ప్రధానిని కాపాడుతాడు. ప్రధాని పి.ఎ అంజలి(సయేషా సైగల్) కూడా రవికాంత్ ప్రధానిని చంపడానికి వచ్చిన టెర్రరిస్ట్ అనుకునితప్పుగా అర్థం చేసుకుంటుంది. నిజం తెలిశాక అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. చంద్రకాంత్కి రవికాంత్ నచ్చడంతో అతన్ని తన ఎన్.ఎస్.జి కమొండోగా నియమించుకుంటాడు. అప్పటికే రవి టీమ్తో ఉన్న జోసెఫ్(సముద్రఖని) కూడా ఎన్.ఎస్.జి కమొండోగా ఉంటాడు. ఇద్దరు మంచి స్నేహితులు. ప్రధానిని చంపాలనుకున్న విక్రమ్ అనే ఓ టెర్రరిస్ట్ పథకం ప్రకారం కాశ్మీర్లోని ప్రధాని చంద్రకాంత్ను బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేస్తాడు. చంద్రకాంత్ స్థానంలో ఆయన కుమారుడు అభిషేక్(ఆర్య) ప్రధాని అవుతాడు.

అయితే కుర్రాడు. ఎలాంటి రాజకీయ అనుభవం ఉండదు. అయితే రవికాంత్ సిన్సియారిటీపై ఉన్న నమ్మకంతో అతన్నే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించుకుంటాడు. మహదేవ్ కంపెనీస్ అధినేత మహదేవ్(బోమన్ ఇరాని) గ్యాస్ కోసం గోదావరి జిల్లాలలోని పంట భూమినంతంటినీ నాశనం చేస్తుంటాడు. ఎదురు తిరిగిన వారిని అణగదొక్కేస్తుంటాడు. అయితే మహదేవ్ మైనింగ్ పనులకు అభిషేక్ అడ్డుచెబుతాడు. అప్పుడు మహదేవ్ ఏం చేస్తాడు? అసలు ప్రధానిని ఎవరు చంపుతారు? ఎందుకు చంపుతారు? వారి పథకమేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

!!విశ్లేషణ!!
ఇలాంటి పోలీల్ పాత్రలు అంటే సూర్యకి బాగా నప్పుతాయి అనే చెప్పాలి. సూర్య ఎన్.ఎస్.జి కమొండో రవి పాత్రలో ఒదిగిపోయారు.తన లుక్ కూడా అదిరిపోయింది. యాక్షన్ పార్ట్లో సూర్య చక్కగా నటించాడు. సినిమా అంతా ప్రధానంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ కోణంలోనే సాగుతుంది. దానికనుగుణంగానే సూర్య పాత్రను డిజైన్ చేశారు. సినిమాలో సూర్య 100 కి 100 శాతం న్యాయం చేశాడు. డైరెక్షన్ లో సెకండాఫ్ లో కాస్త నెమ్మదితనం కనిపించింది.. సయేషా సైగల్ పాత్ర చాలా పరిమితంగా ఉంది. పాటలు, రెండు, మూడు లవ్ సీన్స్కే పరిమితమైంది. సముద్రఖని, పూర్ణ ఇతర పాత్రధారులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో పాటలు బోరింగ్ అనిపించాయి. అలాగే ఎంటర్ టైన్మెంట్ జోనర్ కనిపించలేదు, కనెక్టివీటి ఎంగేజ్ సీన్స్ లేవు, ఎడిటింగ్ నార్మల్ గా ఉంది. అయితే సూర్యకి ఇదిసూపర్ హిట్ నేమ్ అయితే తీసుకురావపోవచ్చు కాని సూపర్ రన్ లో సినిమా వసూళ్లు సాధిస్తుందని చెప్పాలి.

!!ప్లస్ పాయింట్స్ !!
కథ
సూర్య నటన

!!మైనస్ పాయింట్స్!!
తేలిపోయిన క్లైమాక్స్
పాటలు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

!!బాటమ్ లైన్!! సూర్య అభిమానులకు స్పై యాక్షన్ మూవీ.

!!రేటింగ్…2.25!!

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.