ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అభ్యర్ది బండారు శ్రీనివాసరావు

Bandaru Srinivasa Rao Janasena party candidate in the campaign fo Kothapeta

కొత్తపేటలో వైసీపీ తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీగా జనసేన దూసుకుపోతోంది అని చెప్పాలి.. ఇక్కడ జనసేన తరపున పార్టీ కార్యక్రమాలను స్ధానిక నేత బండారు శ్రీనివాసరావు చూసుకుంటున్నారు. పార్టీ తరపున టికెట్ కొత్తపేట నుంచి ఆయన ఆశిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గట్టిపోటి ఇస్తున్నారు అనే చెప్పాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున ఆయన సోదరుడు బండారు సత్యానందరావు బరిలో ఉన్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బరిలో ఉన్నారు.

అయితే ఇక్కడ ఆయన సోదరుడికి ఎన్నికల్లో వెన్నుదన్నుగా ఉండేవారు శ్రీనివాసరావు, అందుకే ఈయనకు ప్రత్యక్షంగా ఇక్కడ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయనకు ఇప్పుడు నేరుగా నాయకులతో ప్రజలతో సులువుగాయాక్సిస్ ఏర్పడింది అని చెప్పవచ్చు. ఆయన జనసేన తరపున ప్రతీకార్యక్రమం ఎంతో దీక్షతో చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ, అలాగే మండలి ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు, ఇక ఆయన సోదరుడు ఎమ్మెల్యే అభ్యర్దిగా టీడీపీ నుంచి ఉన్నారు, జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ఉన్నారు, ఆయన మాత్రం ఈ ముగ్గురికి ఎదురెళ్లి జనసేన గెలుపుకి సాయశక్తులా శ్రమిస్తున్నారు, జనసేన విడుదల చేసే తదుపరి అభ్యర్దుల జాబితాలో ఆయన పేరు ఉంటుంది అని ఆశిస్తున్నారు.

జనసేన తరపున జిల్లా మీడియా విభాగాన్ని ఆయనే కోఆర్డినేట్ చేస్తున్నారు.. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్రస్దాయి పార్టీకార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆయన పాల్గొంటారు. జనగళం వినిపిస్తారు, సెగ్మెంట్లో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు, అలాగే ఆయన సొంత నిధులతో జనసేన పార్టీ కార్యక్రమాలు జరుపుతున్నారు. ముఖ్యంగా సిని అభిమానులను రాజకీయ అభిమానులుగా మార్చారు అంటే ఆయన కృషి ఎంతో ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల గుంటూరులో జరిగిన జనసేన మహాసభ, అలాగే లక్షలాది మందితో ధవళేశ్వరంలో పవన్ కల్యాణ్ చేసిన కవాతు రామచంద్రాపురం మండపేట,రావులపాలెంలో జరిగిన ప్రజాపోరాట యాత్రలకు కొత్తపేట నుంచి వందలాది మందిని ఆయన సొంత వాహనాలలో తీసుకువెళ్లారు. జనసమీకరణ చేయాలి అన్నా ఆయన పిలుపు ఇస్తే వేలాదిగా ఇక్కడ నేతలు తరలివస్తారు. ఇక కొత్తపేటలో ప్రచారం కూడా ఊపందుకుంది.. ఇప్పుడు జనసేన నుంచి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.. ఇటీవల పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను ప్రచురించి ప్రతులు ఇచ్చి జనసేన తరపున ఓటర్లను తనవైపు ఆకర్షించుకునేలా చేస్తున్నారు. అందుకే ఈసారి ఇక్కడ ఆయనకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి అని ఇరు పార్టీల నేతలు జంకుతున్నారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.