Cinetollywood

బాలయ్య ఫాన్స్ .. షాక్ లో ఉన్నార !!

Balakrishna Fans In Shock After Rogue Movie Result

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి తో మంచి సినిమా చేసి ఘాన విజయాన్ని అందుకున్నాడు. వందో సినిమా మంచి సినిమా చేసాడని బాలయ్య ఫాన్స్ హంగామా చేసారు. ఇక అయన 101 వ చిత్రంగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా అనగానే కాస్త ఆలోచించారు కానీ బాలయ్యను పూరి కొత్తగా చూపిస్తాడు అంటూ ఆనందంలో తేలిపోయారేమో .. కానీ ఆ ఆనందం వారికి ఎక్కువ సమయం కూడా లేకుండా పోయింది … ఇప్పుడు బాలయ్య ఫాన్స్ కు ఒకటే టెన్షన్ పట్టుకుంది .. దానికి కారణం పూరి జగన్నాధ్ ? ఎందుకంటే ఈ మధ్య వరస పరాజయాలతో సతమతవుతున్న పూరి కొత్త ఉత్సహంతో కొత్త హీరోని పెట్టి ”రోగ్” .. సినిమా తీసాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా పూరి లో సరుకు అయిపొయింది .. తీసిందే .. మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ”రోగ్” పరాజయంతో .. బాలయ్య ఫాన్స్ తలలు పట్టుకుంటున్నారు .. బాలయ్యకు కూడా పూరి ఖచ్చితంగా ప్లాప్ సినిమా ఇస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. బాలయ్య ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చాడంటే ఆ సినిమా పూర్తయ్యేవరకు మధ్యలో బ్రేక్ వేయడు, అందుకే వారి టెన్షన్ అంతా !! మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య మాఫియా డాన్ గా కనిపిస్తాడని అంటున్నారు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.