Cinetollywood

బాలకృష్ణ సినిమాలో పొలిటికల్ పంచ్ లేవీ ఉండవట !

Puri Jagannath Auto Johney with Balakrishna - Cinetollywood

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తునం విషయం తెలిసిందే. ఇప్పటికే హెవీ యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసిన పూరి త్వరలోనే కొత్త షెడ్యూల్ ను ఏప్రిల్ 5నుండి హైదరాబాద్లో స్టార్ట్ చేయనున్నారు. మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అందరిలోనూ మొదటగా పూరి బాలయ్యను ఎలా చూపిస్తాడు అనే ప్రశ్న మొదలైంది. ఈ ప్రశ్నకు పూరి మెల్ల మెల్లగా సమాధానం చెబుతూ వస్తున్నారు.

మొదట్లో బాలయ్య పాత్ర అభిమానులకు కనువిందు చేసేలా ఉంటుందన్న పూరి తాజాగా అజరిగిన ఒక మాట్లాడుతూ బాలకృష్ణ నా సినిమాలో చాలా రఫ్ అండ్ టఫ్ గా, యంగ్ గా కన్పిస్తారు. ఒక గ్యాంగ్ స్టర్ తరహా పాత్ర. ఇందులో ఆయన ఎలాంటి పొలిటికల్ పంచ్ డైలాగులు చెప్పరు. కేవలం పాత్ర స్వాభావం ప్రకారమే కన్పిస్తారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ పరిచయమవుతుందట. అలాగే సన్నీ లియోని పై స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.