Cinetollywood

అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ

Arjun Reddy Movie review

మూవీ : అర్జున్ రెడ్డి
నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలినీ పాండే, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు
సంగీతం : రధన్
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగా
దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా

రీసెంట్ గా పబ్లిసిటీ విషయంలో వందకు వంద మార్కులు వేసుకున్న సినిమా ఏదన్నా ఉందంటే అది అర్జున్ రెడ్డి మాత్రమే. గతంలో ఒక సారి వాయిదా పడి ఇప్పుడు రిలీజైన ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ ఎవరూ ఊహించని హైప్ వచ్చింది. సినిమా పోస్టర్ల దగ్గర్నుంచి ఈ సినిమా హీరో అర్జున్ రెడ్డి అతి విశ్వాసంతో మాట్లాడిన కొంచెం ఓవర్ మాటలు , దానికి తోడు మహిళా సంఘాలు, పొలిటికల్ లీడర్ల విమర్శలు ఇలా అన్నీ అర్జున్ రెడ్డికి మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో పెయిడ్ ప్రివ్యూస్ లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అసలు ఇంత పబ్లిసిటీని దక్కించుకున్న అర్జున్ రెడ్డి మూవీ ఎంత వరకూ ఆకట్టుకుంది? సినిమా 100 శాతం సక్సెస్ అన్నట్టు మాట్లాడిన హీరో విజయ్ దేవర కొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లది అతి విశ్వాసమా? నమ్మకమా? అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

స్టోరీ :

అర్జున్ రెడ్డి ( విజయ్ దేవరకొండ) చాలా ఆవేశపరుడు. మెడికల్ స్టూడెంట్ అయిన అర్జున్ రెడ్డి తన కంటే జూనియర్ అయిన ప్రీతి ( షాలినీ పాండే) ను ప్రేమిస్తాడు. ప్రీతి కూడా అర్జున్ ను ప్రేమిస్తుంది. చదువు పూర్తయ్యేసరికి ఇద్దరూ గాఢమైన ప్రేమలో కూరుకుపోతారు. అయితే వీళ్ల ప్రేమను ప్రీతి తండ్రి ఒప్పుకోడు. ప్రీతికి నచ్చకపోయినా ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి కూడా జరిపించేస్తాడు. ప్రీతికి దూరమైన అర్జున్ రెడ్డి లవ్ ఫెయిల్యూర్ తో చాలా కుంగిపోతాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి బ్యాడ్ హ్యబిట్స్ ను అలవాటు చేసుకుంటాడు. ఇక తనకు సహజ సిద్ధంగా ఉన్న కోపం వలన డాక్టర్ వృత్తిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. పూర్తిగా డిప్రెషన్ లోకి కూరుకుపోయిన అర్జున్ రెడ్డి ఎలా తిరిగి మామూలు మనిషి అయ్యాడు? అతని ప్రేమకథ చివరికి ఏమైంది? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ :

ఒక విధంగా అర్జున్ రెడ్డి పాత్ర చాలా ఛాలెంజింగ్ పాత్ర. ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇలాంటి టిపికల్ క్యారెక్టర్ ను ఎంచుకోవడం దాన్ని మెప్పించడం గ్రేట్ అనే చెప్పాలి. అసలు అదుపు చేసుకోలేని కోపం, తట్టుకోలేనంత ప్రేమ చూపిండం, వ్యసనాలను బానిసైన ఒక ఫెయిల్యూర్ లవర్ గా సూపర్ గా యాక్ట్ చేసాడు. చెప్పాలంటే ఈ పాత్రను చేసి విజయ్ తన స్థాయిని అమాంతం పెంచుకున్నాడు. ఇక హీరోయిన్ షాలిని పాండే కూడా నటనలో ఓకే అనిపించుకుంది. ఇక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రాహుల్ రామకృష్ణ ది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అతని కామెడీ టైమింగ్ బాగా ఉండటంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

టెక్నికల్ టీమ్ :

ఈ జనరేషన్ కు అనుగుణంగా యూత్ ఈజీగా కనెక్ట్ అయ్యే పాయింట్ ను తీసుకుని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించడంలో విజయం సాధించాడు. ఒక విధంగా చెప్పాలంటే పాత దేవదాసు సినిమానే ఈ తరానికి అనుగుణంగా మార్చి చూపించాడు. అయితే కేవలం యూత్ ను టార్గెట్ చేస్తూ సినిమా తీయడం బాగానే ఉన్నా మిగిలిన వర్గాల ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు దూరమవుతారు. చాలా సీన్స్ ను చాలా రియలిస్టిక్ గా చూపించి దర్శకుడు తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ముఖ్యంగా తన ఒక మనిషి అదుపులేని వ్యక్తిత్వం ఎన్ని కష్టాలను తీసుకొస్తుందో ఈ సినిమాలో దర్శకుడు చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా హీరో పడే మానసిక సంఘర్షణను చాలా బాగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా తీసాడు. అయితే సెకండాఫ్ లో ప్రేక్షకులు కొద్ది సేపు అసహనానికి గురవుతారు. క్లైమాక్స్ పాజిటివ్ గా ముగించాలని దర్శకుడు ఆరాటపడినట్టు క్లియర్ గా అర్ధమవుతుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే సినిమా స్థాయి పెరిగి ఉండేది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మ్యూజిక్ డైరెక్టర్ రధన్ తన సత్తా చాటాడు. ఇతనికి భవిష్యత్ ఉందనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

మూవీలో ఎమోషనల్ సీన్స్
విజయ్ దేవరకొండ సూపర్బ్ ఫెర్ఫార్మెన్స్
సందర్భాను సారంగా వచ్చే కామెడీ

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో నిడివి పెరిగిపోవడం
ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే అంశాలు లేకపోవడం

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.