
జగన్ ప్రమాణ స్వీకారానికి బాబు: ఆహ్వానించిన జగన్: ఆసక్తి కర సంభాషణ.!
ఏపీ రాజకీయాల్లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో హోరా హోరీ తలపడిన రెండు పార్టీల అధినేతలు నవ్వుకుంటూ..కుశల ప్రశ్నలతో..సరదాగా…హుందాగా మాట్లాడుకున్నారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్..టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసారు. ఆ ఇద్దరి మధ్య ఆసక్తి కర సంభాషణ చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ అంశం రెండు పార్టీల్లోనూ ఆసక్తి కరంగా మారింది. ప్రమాణ స్వీకారానికి రండి.. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసారు. కుశల ప్రశ్నలు వేసారు. ఈ నెల 30న తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానించారు. మోదీ..కేసీఆర్‌ను ఆహ్వానించిన విషయం సైతం చంద్రబాబుతో పంచుకున్నారు. ఏపీ అభివృద్ది లో మీ సహకారం. కావాలని కోరారు.
చంద్రబాబు వస్తారా..ప్రతినిధులను పంపుతారా.. ఎన్నికల్లో పరాజయం తరువాత నేరుగా జగన్ ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించటంతో ఇప్పుడు చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేక తన ప్రతినిధులుగా పార్టీ నేతలను పంపుతారా అనే చర్చ మొదలైంది. గతంలో చంద్రబాబు సైతం 2014లో తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని జగన్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, జగన్ హాజరు కాలేదు. 2004, 2009 లోనూ వైయస్సార్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కాలేదు. అయితే, ఇప్పుడు చంద్రబాబు మరి జగన్ ఆహ్వానం మేరకు వస్తారా..రారా అనే చర్చ మొదలైంది. దీని పైన బుధవారం జరిగే టీడీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఇప్పటికే కేసీఆర్‌తో పాటుగా బీజేపీ కేంద్ర నేతలు జగన్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లుగా సమాచారం అందింది.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్