
కోహ్లీకి అనుష్క దూరం.. ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు!
సినీ పరిశ్రమ, క్రీడా రంగానికి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లు, హీరోయిన్‌లు ఎంతో మంది ప్రేమలో మునిగి తేలారు. వీరిలో చాలా మంది తమ బంధాన్ని మధ్యలోనే ముగించేయగా.. కొందరు మాత్రం పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. అలాంటి జంటలలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జోడీ ఒకటి. ఓ యాడ్ కోసం కలిసిన వీరిద్దరూ ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు.
ఆ తర్వాత రహస్యంగా లవ్ ట్రాక్ నడిపి.. చివరకు 2017 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. క్రికెట్ ఆటతో విరాట్ కోహ్లీ, సినిమాలతో అనుష్క శర్మ ఎంత బిజీగా ఉన్నా.. దొరికిన కాస్త సమయాన్ని ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు. కోహ్లీకి పర్యటనల మధ్య దొరికే ఖాళీ సమయంలో ఇద్దరూ టూర్‌లకు వెళ్తుంటారు.
వారి టూర్‌లకు సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటుంది విరుష్క జోడి.
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ అనంతరం అనుష్క శర్మతో కలిసి విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. పుటుటురులోని బ్రూస్ప్రింగ్స్‌ను సందర్శించారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, జూనియర్ పేసర్ నవ్‌దీప్ సైనీలు విరుష్కలతో కలిసి అక్కడ ఎంజాయ్ చేశారు. తాజాగా అనుష్క తన భర్తను విడిచి భారత్‌కు పయనమైనట్లు సమాచారం తెలుస్తోంది.
శుక్రవారం నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. దీంతో అనుష్క స్వదేశానికి తిరుగు పయనమయ్యారని సమాచారం. అనుష్క భర్తను విడిచి భారత్‌కు వస్తున్న సందర్భంగా విరాట్ కోహ్లీని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టింది. ‘వీడ్కోలు పలకడం సమయంతో పాటు తేలికవుతుందని భావిస్తుండొచ్చు. కానీ.. అది ఎప్పటికీ జరగదు’ అని కోహ్లీతో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది. మరోవైపు వాలెంటైన్స్ డే సందర్భంగా అనుష్కతో దిగిన ఫొటోను కోహ్లీ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
కోహ్లీకి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సి రావడంతో అనుష్క ఇలా భావోద్వేగం చెందింది. అనుష్క శర్మ ఇటీవల ‘జీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి స్టార్లతో కలిసి ఆమె నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. తాజాగా అనుష్క ఇండియన్ ఉమెన్ సీనియర్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాలో నటించనుంది. ఈ పాత్ర కోసం అనుష్క క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటోంది.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్