Cinetollywood

ఇట‌లీలో పెళ్లిచేసుకున్న అనుష్క‌- విరాట్ 

వారిద్ద‌రూ  ఎక్క‌డ క‌లిసినా  ఓ సంచ‌ల‌న‌మే,  వారి ప్రేమ  అటువంటిది వారే ప్ర‌ముఖ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ బ్యూటీ అనుష్కశ‌ర్మ‌.. తాజాగా వారు ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్త గ‌త వారం రోజులుగా వినిపిస్తూనే ఉంది, అయితే వాటిపై వారు ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌లేదు తాజాగా విరుష్క జంట ఒక‌టైంది.
సోమ‌వారం ఉద‌యం ఇటలీలో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు కుటుంబానికి ఇరువురికి అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు .. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో తెలియ‌చేశారు అనుష్క విరాట్ కోహ్లీ.. ఇక ఈ వేడుకుకు ఇంటి వారు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.. పెళ్లి చేసుకున్న ఈ జంట ఇట‌లీలో కొన్ని రోజులు విహ‌రించ‌నున్నారు త‌ర్వాత స్వదేశానికి వ‌చ్చి ఇక్క‌డ విందు ఇవ్వ‌నున్నారు  ఈజంట‌, అయితే దిల్లీలో రాజ‌కీయ నాయ‌కుల‌కు ఈ నెల 21 న విందు ఇవ్వ‌నున్నారు… ఈ విందుకు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హాజ‌ర‌వ‌నున్నారు.. తర్వాత ముంబయిలో ఈ నెల  26న మరో విందు  ఏర్పాటు చేయ‌నున్నారు, ఈ జంట  ఈ విందుకు ఇండియా క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు హాజ‌రుకానున్నారు.. అంతే కాకుండా వారి స్నేహితుల‌ను కూడా ఈ విందుకు పిల‌వ‌నున్నారు.

Milan: Indian cricket captain Virat Kohli with his actress wife Anushka Sharma during their wedding in Milan, Italy on Monday. PTI Photo (EDITORS PLS- CO-RELATE WITH STORY DEL68)(PTI12_11_2017_000207B)

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.