
కాపులకు మరో షాక్ ?
కాపుల రిజర్వేషన్ అంశం ఏపీలో మరింత చర్చకు వస్తోంది.. ఏపీలో కాపుల రిజర్వేషన్లు 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇది. దీంతో కాపులు అందరూ మెజార్టీ తెలుగుదేశానిక ఓటు వేశారు… అయితే ఇప్పుడు ఈ అంశాన్ని తెలుగుదేశం పక్కన పెట్టింది.. అధికారంలోకి వచ్చిన తర్వాత, కాపుల రిజర్వేషన్ల అంశం పక్కన పెట్టి, కాపులకు కోట్ల రూపాయల ఫండ్ అని ప్రకటించింది. అయితే ఇవన్ని ఒట్టిమాటలుగా మిగిలాయి.
చివరకు బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, కాపు రిజర్వేషన్ల వల్ల తాము నష్టపోతాము అని కొత్త గళం విప్పడంతో, చేసేది ఏమీ లేక సైలెంట్ అయింది తెలుగుదేశం పార్టీ… అయితే ముద్రగడ పద్మనాభం దీనిపై తన పందా చూపారు… కాపులను ఏకం చేసి ఓకే తాటిపై తీసుకువచ్చారు.. తన ప్రత్యక్ష పోరాట కార్యాచరన ప్రకటిస్తాను అని చెప్పేసరికి, తెలుగుదేశం మంజునాథకమీషన్ రిపోర్టుకు ముందే ఓ నిర్ణయం తీసుకుంది.
దీంతో కాపులు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వస్తారో తెలియక వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయించి.. కేంద్రానికి పంపారు చంద్రబాబు… ఇప్పుడు ఆబిల్లు హూంశాఖ పరిధిలో ఉంది.. కాని తాజా రాజకీయ పరిస్ధితులు కేంద్రానికి తెలుగుదేశానికి మధ్య జరుగుతున్న వార్ తో, ఈ బిల్లు మరింత జాప్యం అవుతుంది అని తెలుస్తోంది.
ఈ బిల్లును కేంద్రం ఆమోదించే అవకాశం లేదు అంటున్నారు దీనికి ప్రధాన కారణం…కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఇందులో లోపాలను వెల్లడిస్తోంది. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి మించకూడదు అని సుప్రీం కోర్టు గతంలో వెల్లడించిన తీర్పును గుర్తుచేస్తోంది.. దీంతో కాపులు ఈ బిల్లు పై నైరాస్యంలో ఉన్నారు. ఇక బిల్లు ఆమోదింపచేసి ఏపీ శాసనసభకు కేంద్రం పంపాలి… దీనికి అన్ని శాఖలు అనుమతులు ఇవ్వాలి, అంగీకారం తెలిపాలి.. అటువంటి పరిస్దితి ఇప్పుడు కనిపంచడం లేదు…. ఇకచేసేది ఏమీ లేదు అని కాపులు చర్చించుకుంటున్నారు.. అయితే ముద్రగడ మరి ఈ విషయం తెలిసినా ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది ఓ ప్రశ్నగా కనిపిస్తోంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు