భార్యతో కలిసి జనసేనలోకి మరో ఎమ్మెల్యే

Another MLA joining to Janasena Party - Pawan Kalyan

ఏపీలో ఎన్నికల వేడిరాజుకుంది అనుకున్న విధంగా కొందరు నేతలు పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారు.. ఇక వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఇప్పుడు ఈనాలుగు పార్టీల నుంచి జంపింగ్ లు జరుగుతాయి అని తెలుస్తోంది.. అయితే జనసేనలో నాయకులు కొరత ఉంది కాబట్టి చాలా పార్టీల నుంచి జనసేనలోకే నాయకులు చేరే అవకాశం ఉంది.. పైగా జనసేన సింగిల్ గా ఎవరితో పొత్తులు లేకుండా పోటీ చేస్తాను అని ప్రకటించడం తో, నాయకులు చేరి పార్టీలో తమ విజయం నమోదు చేయాలి అని చూస్తున్నారు.. పవన్ కూడా ఇప్పటి వరకూ ఓ 50 మంది కత్తిలాంటి సీనియర్ నేతలను ఎమ్మెల్యే అభ్యర్దులుగా సిద్దం చేశారు.. ఇటీవల రావెల కిషోర్ బాబు జనసేనలో చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా జనసేనలో చేరుతున్నారు.

ఈ నెల 21న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరతా. అంతకు ముందే ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి రాజీనామా చేస్తా. రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మెట్లో పంపిస్తాను’’ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు.
ఇక ఆయన గత ఆరు నెలలుగా పార్టీ తరపున అంత యాక్టీవ్ గా లేరు ఆయన భార్య కూడా జనసేన కార్యక్రమాల్లో కొన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నారు.. దీంతో ఆయన బీజేపీకి దూరం అవుతారు అని కచ్చితంగా జనసేనలో చేరుతారు అని అందరూ అనుకున్నారు.. చివరకు అలాగే జరిగింది.

రాజకీయంగా జనసేనలో చేరాలి అని అనుకుంటున్నా…ఇప్పటికే పవన్ కల్యాణ్తో భేటీ అయ్యాను. 21వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలో ఆయన సమక్షంలో సహచరి లక్ష్మీపద్మావతితో కలిసి పార్టీ తీర్థం తీసుకుంటా. నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నా భార్య
ఐదేళ్లుగా జనసేనలోనే ఉన్నారు అని ఆకుల తెలిపారు.ఇలా ఇద్దరు రెండు పడవల మీద కాలు ఎందుకు అని, ఒకే పడవ మీద రాజకీయ ప్రయాణం చేయనున్నారు అంటున్నారు జనసేన నాయకులు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.