
పవన్ బన్నీ విజయ్ సినిమాల్లో అనసూయ
బుల్లితెరలో యాంకర్ గా చేస్తూనే నటి అనసూయ సినిమాల్లో కూడా బిజీ ఆర్టిస్ట్ అయింది.. ఇక రంగమ్మత్తగా ఆమెకు ఎంత ఫేమ్ వచ్చిందో తెలిసిందే.. అయితే తాజాగా ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి అని తెలుస్తోంది.. ఓ పక్క బుల్లితెర షోలు చేస్తూనే ఇటు సినిమాలు చేస్తోంది యాంకర్ అనసూయ.
యాంకర్ కం నటి అనసూయకు మంచి పేరు ఉంది. పాత్ర ఏదైనా, ఆ పాత్రకు తగ్గ న్యాయం చేయడానికి చాలా శ్రమిస్తుంది అంటారు. క్షణం, రంగస్థలం చిత్రాలతో అద్భుతం నటన కనబరిచిన అనసూయకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి, ఇక తాజాగా ప్రతినాయక పాత్రలో కూడా అనసూయ నటించనుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
అర్జున్ రెడ్డి చిత్రం తో టాలీవుడ్ మనసు దోచుకున్న విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించారు. ఇక తర్వాత నిర్మిస్తున్న చిత్రంలో కూడా అనసూయకు కీలక పాత్ర ఇచ్చారట.. అందులో ప్రతినాయకురాలిగా ఆమెకు అవకాశం ఇచ్చారట, ఇక తాజాగా సెట్స్ పై ఉన్న అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఆమె ఓ పాత్ర చేస్తోంది.. ఇక పవన్- క్రిష్ కలయిక లో వస్తున్న pspk27 లో కూడా ఆమె నటిస్తోంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు