Cinetollywood

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా రివ్యూ

Amma rajyam lo kadapa biddalu review

రివ్యూ : అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు
రేటింగ్ : 2/5
తారాగణం : అజ్మల్ అమీర్, ధీరజ్ కేవీ, బ్రహ్మానందం, అలీ, ధనంజయ్ ప్రభునే, మహేష్ కత్తి, స్వప్న, ధనరాజ్, పృథ్వి రాజ్, జాఫర్ బాబు తదితరులు
సంగీతం: రవి శంకర్
నిర్మాత : అజయ్ మైసూర్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత తాజాగా మరొక వివాదాస్పద చిత్రమైన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకి దర్శకత్వం వహించారు రామ్ గోపాల్ వర్మ. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల చుట్టూ ఈ సినిమా నడుస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైటిల్ దగ్గర నుంచి నిన్న మొన్న విడుదలైన పాటల వరకూ వివాదాలను సృష్టించిన ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ అనగా డిసెంబర్ 12, 2019 న విడుదల అయింది. 

కథ:

సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వి ఎస్ జగన్నాధ రెడ్డి అనే ఒక రాజకీయ నేత ఈ సినిమాలో హీరో. అతను ఒక రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు? రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్ సమయంలో మిగతా రాజకీయ నాయకులైన బాబు, మన సేన పార్టీ ప్రెసిడెంట్, పాల్ తదితరులు ఏం చేశారు? వి ఎస్ జగన్నాథ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

అజ్మల్ అమీర్ సినిమాలో తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు అని చెప్పుకోవచ్చు. తన పాత్రకి బాగా సెట్ అయిన అజ్మల్ పర్ఫామెన్స్ పరంగా కూడా బాగానే నటించాడు. కె.వి ధీరజ్ కూడా తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ కూడా తను చేసిన పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి అందరిని మెప్పించాడు ధనంజయ్ ప్రభునే.

అలీ మరియు బ్రహ్మానందం లకు ఈ సినిమాలో మంచి పాత్రలు దక్కాయి. వారు ఆ పాత్రలో చాలా బాగా నటించారు. మహేష్ కత్తి మరియు స్వప్న కూడా తమకిచ్చిన పాత్రలలో బాగానే నటించారు. ధన్ రాజ్ నటన ఫర్వాలేదనిపిస్తుంది. పృథ్వీరాజ్ మరియు జాఫర్ బాబు కూడా ఈ సినిమాలో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

అనుకున్న విధంగానే ఈ సినిమా మొత్తం రాజకీయ నేపధ్యం తో నడుస్తుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా కోసం మంచి కథని సిద్ధం చేసుకున్నారు. కానీ కథనం విషయంలో మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవాలి.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆర్ జీ వి నెరేషన్ స్లోగా ఉండటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. మిగతా సినిమాలతో పోలిస్తే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో కూడా కథకంటే కాంట్రవర్సీ పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు పరవాలేదు అనిపించాయి. రవి శంకర్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. పాటల సంగతి పక్కన పెడితే రవిశంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా బాగా సెట్ అయింది. సినిమాటోగ్రాఫర్ జగదీష్ ఈ సినిమా కోసం మంచి విజువల్స్ అందించారు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

నేపధ్య సంగీతం, నటీనటులు

బలహీనతలు:

స్క్రీన్ ప్లే, సాగతీత సన్నివేశాలు, స్లో నెరేషన్

బాటమ్ లైన్: 

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వివాదాలు ఎక్కువ కథ తక్కువ.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.