
బాహుబలి రికార్డ్ బ్రేక్..షాకిస్తున్న పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.. తగ్గేదే లే!
రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప సినిమా తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ లెక్కలు బయటకొచ్చాయి.
అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన అన్ని అప్డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాకు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని తెలిసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ‘పుష్ప ది రైజ్’ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 144.90 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 101.75 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.
ఇక కర్ణాటకలో చూస్తే 9 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళ 4 కోట్లు, హిందీ 10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.15 కోట్లు, ఓవర్సీస్ 13 కోట్లు, మొత్తంగా చూస్తే వరల్డ్ వైడ్‌గా 144.90 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బరిలోకి దిగుతోంది. ఇకపోతే టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రాల జాబితాలో ‘పుష్ప’ మూవీ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఈ సినిమా కంటే ఎక్కువగా బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే బాహుబలి 1 రికార్డును ‘పుష్ప’ అధిగమించడం మరో విశేషం.
Gallery
Latest Updates
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్
-
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
-
ప్రియురాలు ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి స్టోరీ “విక్రమ్ సినిమా”
-
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja
-
అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్..సుకుమార్‌తో చిరంజీవి మీట్
-
Ram Charanతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నా:NTR ..ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే