ప‌వ‌ర్ స్టార్ ఫంక్ష‌న్ కు మెగాస్టార్

Agnathavasi audio function chief Guest Megastar Chiranjeevi | cinetollywood.com

అన్న‌ద‌మ్ములు అంటే అప్పుడు రాముడు – ల‌క్ష్మ‌ణుడు అంటారు.. సినీ ఇండ‌స్ట్రీలో మెగా బ్ర‌ద‌ర్స్ ని కూడా అలాగే పిలుస్తారు.. అన్న అంటే అంత అభిమానం ఇరువురు త‌మ్ముళ్ల‌కు, ఇటు ప‌వ‌న్ కు- అటు నాగ‌బాబుకు అన్న‌చిరంజీవి అంటే అంత అభిమానం… రాజ‌కీయంగా , సినిమాల ప‌రంగా ప‌క్క‌న పెడితే  కుటుంబాల్లో  బంధాల‌కు ఎక్కువ వాల్యూ   ఇచ్చేది  కూడా మెగా ఫ్యామిలీ దే అంటారు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు..

 

వీరు ఫ్యామిలీ సినీ  ఆడియో ఫంక్ష‌న్ల‌కు, స‌క్సెస్ ఫంక్ష‌న్ల‌కు కూడా హాజ‌రై  మెగా అభిమానుల‌కు హుషారు తెప్పిస్తారు. తాజాగా  పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అజ్ఞాతవాసి..ఈ సినిమా ఆడియో లాంచ్ వ‌చ్చే వారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించబోతున్నారు.. అయితే ఈ ఆడియో వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రుకానున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి. గతంలో కూడా పవన్‌ నటించిన సర్దార్‌ గబ్బర్‌ సింగ్  ఆడియో లాంచ్‌ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా హాజరయ్యారు…అదే విధంగా అజ్ఞాతవాసి  ఆడియో వేడుకకు కూడా  చిరంజీవి వస్తే బాగుంటుందని  మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా టీజ‌ర్ ను ఈ నెల 16 న విడుద‌ల చేయ‌నుంది చిత్ర యూనిట్. అలాగే  2018 జనవరి 10న సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు..

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.