
Godse Teaser
దర్శకుడు గోపీ గణేశ్, నటుడు సత్యదేవ్ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘గాడ్సే’. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల
దర్శకుడు గోపీ గణేశ్, నటుడు సత్యదేవ్ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘గాడ్సే’. సామాజిక అంశాల నేపథ్యంలో నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా రూపొందిస్తున్నారు. CK స్క్రీన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి మూవీపై ఆసక్తి పెంచేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ టీజర్ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగిఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అంటూ జనాన్ని మేల్కొలిపే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ”సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయ్.. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్.. వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్.. కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వంద, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్ రా? ఎందుకంటే సేవ పేరుతో మీరు ప్రజలు సొమ్ము దోచుకుంటున్నారు కాబట్టి” అని సత్యదేవ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ టీజర్‌లో హైలైట్ అవుతూ జనాన్ని ఆలోచింపజేసేలా ఉంది.
ఈ చిత్రంలో గాడ్సే పాత్రలో సత్యదేవ్ నటించగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. నాగబాబు, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వీ కీలకపాత్రలు పోషించారు. ఈ టీజర్ చూస్తుంటే గాడ్సే చిత్రంతో జన హితమైన సందేశం ఇవ్వబోతున్నారని స్పష్టమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ ఇచ్చి అతిత్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్