48 గంటల సమయంలో తెలంగాణలో ఊపుతెచ్చిన కొత్త సర్వే

A-new-survey-in-Telangana-election-who-will-win

తెలంగాణ రాష్ట్రంలో మరో 48 గంటలు ఎన్నికలకు సమయం ఉంది.. ఈ సమయంలో తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓటమి చెందుతారు, ఎవరు క్లీన్ స్వీప్ చేస్తారు అనే విషయంలో పలు వార్తలు వస్తున్నాయి.. లగడపాటి సర్వే నుంచి ఇప్పుడు పలు సర్వేలు ఇక్కడ తెలంగాణ గడ్డపై ఎవరు గెలుస్తారు అనేదానిపై స్పష్టమైన మెజార్టీతో పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నాయి.. ఇప్పటికే సీపీఎస్ సర్వే పేరిట టీఆర్ఎస్కు 94 నుంచి 104 సీట్లు వస్తాయని… కూటమికి కేవలం 16 నుంచి 21 స్థానాలు వస్తాయని తేల్చారు.

ఇక ఇప్పుడు మరో సరికొత్త సర్వే టీఆర్ఎస్ కు పట్టం కట్టింది తాజాగా ఎన్డీటీవీ తెలంగాణ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ స్వయంగా ఈ సర్వేను పర్యవేక్షించి ఆ ఫలితాలను ప్రకటించారు. తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతం ఉత్తర తెలంగాణలో బలమైన పార్టీగా టీఆర్ఎస్ శక్తిగా వస్తుంది అని ప్రజలు తెలియచేశారు అని చెప్పింది సర్వే. ఇప్పుడు మధ్యలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి అంటే కచ్చితంగా కేసీఆర్ కు ఓటు వేయాలి అని ప్రజలు తెలియచేశారు.

ఇక తెలంగాణలో ఉన్న పలు పథకాలు అమలు కావాలి అంటే కేసీఆర్ రావాలి అని అన్నారట. తాజాగా .ఓపినీయన్ పోల్స్ ఆధారంగా తెలంగాణలో టీఆర్ఎస్ కు 66 సీట్లు, కాంగ్రెస్+టీడీపీ కూటమికి 39 సీట్లు, ఎంఐఎంకు 7, బీజేపీకి 4 సీట్లు, ఇతరులు మూడు సీట్లు గెలుస్తారని ఎన్టీటీవీ తెలిపింది. మొత్తానికి 14 సర్వేలు నేటితో తెలంగాణకు పాజిటివ్ గా రిపోర్టు వచ్చింది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.