
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
మాటరాని మౌన మీది మూవీ రివ్యూ
టైటిల్ : మాటరాని మౌనమిది!
రేటింగ్ : 3.25/5
తారాగణం : మహేష్ దత్త , సోనీ శ్రీవత్సవ, శ్రీహరి ఉదయగిరి,
సంజయ్, అర్చన అనంత్, సుమన్ శెట్టి
కెమెరా : శివ రామ్ చరణ్
సంగీతం : ఆశిర్ లుక్ , సుమన్ జీవ డి
ఎడిటింగ్ : శివ శర్వాణి
నిర్మాత : వాసుదేవ్ రాజపంతుల, ప్రభాకర్ డి
దర్శకత్వం : సుకు పూర్వజ్
విడుదల తేదీ : 19 ఆగష్టు 2022
తెలుగు సినిమా ప్రపంచంలో సుక్కు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ పుష్ప రూపంలో దేశం మొత్తం “తగ్గేదేలే” అంటూ ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు అదే పేరుతో ఒక యువ దర్శకుడు విభిన్నమైన చిత్రాలు తీస్తూ ప్రేక్షకుల్ని మెల్లగా తన వైపు తిప్పుకుంటున్నాడు.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన “శుక్ర” తన మొదటి చిత్రం. ఈ సారి లవ్, సెంటిమెంట్, సస్పెన్స్, హారర్ అండ్ త్రిల్ ని సమపాళ్లలో కలిపి ముల్టీ జోనర్ గా “మాటరాని మౌనమిది” గా మన ముందు పెట్టారు.
మంచి వాయిస్ ఓవర్ తో “చిన్న కథ” నుంచి “పెద్ద కథ” అంటూ సినిమా మొదలవుతూనే కావల్సినంత ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది.
మన అందరికీ అమితంగా నచ్చే పేర్లు సీతా, రామ్. ఈ సంవత్సరం రిలీస్ అయ్యి రికార్డు లు బద్దలు కొట్టిన RRR నుంచి ఈ మధ్యనే రిలీస్ అయిన సీతారామం దాకా హీరో హీరోయిన్ల పేర్లు రామ్ సీత లే. ఇదంతా ఎందుకంటే “మాటరాని మౌనమిది” లో కూడా కథ “రామ్, సీత” పేర్ల చుట్టే తిరుగుతుంది.
మరి “మాటరాని మౌనమిది” సినిమా ఎలా వుంది?
బావమరిదిలా కథగా సినిమా మొదలై రామ్ సీతల ప్రేమ కథగా ఎలా మారింది?
రామ్ ఆ ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడే పెరట్లో వాచ్మాన్ కి ఒక ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం ఎవరిది? తన అక్క చనిపోయిన కూడా రామ్ తన బావ ఇంటికి ఎందుకు వచ్చాడు?
ఆ ఉంగరం పెట్టుకున్నాక రామ్ చుట్టూ జరిగే గమ్మత్తైన విషయాలు ప్రేక్షకులకి కావల్సినంత త్రిల్ ని ఇస్తాయి.
మాటలురాని సీత కి రామ్ పరిచయం. బావ, బావ మరిదిలతో స్నేహితుల హడావుడి. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లో అనిపించిన సరదాగా సాగిపోతుంది. “దంపుడు లక్ష్మి” సాంగ్ తో థియేటర్ కాసేపు ఈలలలో తో ఊగిపోతుంది. నకిలీ స్వామీజీ గా సుమన్ శెట్టి హడావుడి బాగానే ఎంటెర్టైన్ చేస్తుంది.
రామ్, సీత ల మధ్య ప్రేమ. ఒక మంచి సాంగ్. చాలా అద్భుతంగా అనిపించే కెమెరా వర్క్. కథ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన నేపథ్య సంగీతంతో, మంచి ఎడిటింగ్ తో , ఈ సినిమా చూసే ప్రేక్షకుడ్ని కూర్చీ నుంచి కదలనివ్వదు.
ఒక మంచి హారర్ ట్విస్ట్ తో ఇంటర్వల్ వేసి ప్రేక్షకుడికి నెక్స్ట్ ఏంటి? అనే ఆలోచనతో బయటకి పంపిస్తాడు దర్శకుడు.
అసలు కథ మొత్తం ఈ దర్శకుడు సెకండ్ హాఫ్ లో దాచి పెట్టాడు.
తర్వాత వచ్చే మంత్రగాడు వేషం ఎవరు వేసారో గానీ చాలా బాగుంది. రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ఈ ఎపిసోడ్ ని తీసిన డైరెక్టర్ సుక్కు పూర్వజ్ ని మెచ్చుకోవాలి. బావ, బావమరిది, వాళ్ళతో వున్న స్నేహితులు. వీళ్లలో అసలు దెయ్యం ఎవరు? అని మాంత్రికుడు చేసే పరీక్షలు కొత్తగా అనిపిస్తూ కావల్సినంత హాస్యం కూడా పండిస్తాయి.
అసలు దెయ్యం ఎవరు? దెయ్యం వుందా? ఇలా కన్ఫ్యూస్ చేస్తూ ఫ్లాష్బాక్ 1986 కి వెళ్తుంది కథ. ఈ ఎపిసోడ్ ని అద్భుతంగా తీసిన దర్శకుడికి చాలా మార్క్స్ పడుతాయి. ఫ్యూచర్ లో మరిన్ని అవకాశాల్ని తెప్పిస్తాయి. ఇక్కడ అరకు అందాల్ని కెమెరా మ్యాన్ చక్కగా చూపించారు.
సెకండ్ హాఫ్ లో వచ్చే రామ్ ఎవరు? ఫస్ట్ హాఫ్ లో సీత మౌనం. సెకండ్ హాఫ్ లో రామ్ మౌనం. ఇద్దరు రామ్ లకి , సీత కి వున్న లింక్ ఏంటి ? వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే “మాటరాని మౌనమిది” సినిమా చూడాల్సిందే!
కార్తీక దీపం ఫేమ్ అర్చన గారు సెకండ్ హాఫ్ లో “రామ్” కి అమ్మగా బాగా నటించారు, కాదు కాదు జీవించారు. సెకండ్ హాఫ్ లో వచ్చిన రామ్ కి మాటలు లేకపోయిన తన కళ్ళతో , ఎక్స్ప్రెషన్ తో చాలా బాగా చేసాడు. తాను ప్రేమ ని ఎక్స్ప్రెస్ చేసే సీన్ ఆకట్టుకుంటుంది. కంటతడి పెట్టిస్తుంది.
సీత పాత్రలో ఫస్ట్ హాఫ్ లో మూగ పిల్లగా , సెకండ్ హాఫ్ లో చలాకీగా సోనీ శ్రీవత్సవ బాగా చేసారు.
రామ్ గా మహేశ్ దత్త, శ్రీహరి ఉదయగిరి ఇద్దరూ పోటీపడి చేసారు.
బావ పాత్రలో చేసిన సంజయ్, మిగతా స్నేహితుల గ్యాంగ్ కూడా ఆకట్టుకున్నారు. మంచి టైమింగ్ తో అలరించిన చందు, కామరాజు గా కాశీరాజు పేర్లు గుర్తుండి పోతాయి.
బలం:
కథ , కథనం, మాటలు
రెండు మెలోడీ సాంగ్స్ , నేపథ్య సంగీతం
డీసెంట్ కెమెరా వర్క్
పర్ఫెక్ట్ ఎడిటింగ్
కార్తీక దీపం అర్చన స్క్రీన్ ప్రెసెన్స్
బ్రిలియంట్ దర్శకత్వం
న్యాచురల్ మాటలు
మాస్ కోసం దంపుడు లక్ష్మి సాంగ్
ఫ్యామిలీ తో కలిసి చూడవచ్చు
బలహీనతలు :
ఫస్ట్ హాఫ్ స్లో అనిపించడం
చాలా వరకు కొత్త ముఖాలు కాబట్టి ప్రేక్షకులు అడ్జస్ట్ కావడానికి పట్టే సమయం
Verdict : *** ఆకట్టుకొనే ముల్టీ జోనర్ కథ. కుటుంబ సమేతంగా వచ్చి చూసి సరదాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.